క్రీడాభూమి

ఐపిఎల్ నుంచి వైదొలిగిన మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉద్ధేశ్యపూర్వకంగా బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ వ్యవహారాల నుంచి తప్పుకున్నాడు. ఈ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న విజయ్ మాల్యా ఆర్‌సిఎస్‌పిఎల్ (రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్) డైరెక్టర్ పదవికి రాజీనామా చేశాడని ఆ జట్టు ఆర్‌సిబి యాజమాన్యం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కు తెలియజేసింది. ప్రస్తుతం ఆర్‌సిబి యాజమాన్య స్థితి గతులను వివరిస్తూ ఆ ఫ్రాంచైజ్ నుంచి ఈ నెల 7వ తేదీన ఐపిఎల్ పాలక మండలికి ఇ-మెయిల్ అందిందని బిసిసిఐకి చెందిన సీనియర్ అధికారి వెల్లడించాడు. ‘అవును.. ప్రస్తుతం ఆర్‌సిబి జట్టుకు ఇన్‌చార్జిగా వ్యవహిరస్తున్న వాణిజ్య వ్యవహారాల ఉపాధ్యక్షుడు రసెల్ ఆడమ్ నుంచి మాకు ఇ-మెయిల్ అందింది. ఆర్‌సిఎస్‌పిఎల్ డైరెక్టర్ పదవికి విజయ్ మాల్యా రాజీనామా చేశాడని, ఆయన కుమారుడు సిద్ధార్థ మాల్యా సంస్థ డైరెక్టర్ల బోర్డులో ఉన్నంత వరకు విజయ్ మాల్యా గౌరవ చీఫ్ మెంటర్ వ్యవహరిస్తాడని ఈ ఇ-మెయిల్‌లో పేర్కొన్నారని ఆ అధికారి శుక్రవారం పిటిఐ వార్తా సంస్థకు వివరించాడు. డైరెక్టర్ పదవికి విజయ్ మాల్యా రాజీనామా చేసినప్పటికీ తమ జట్టు యాజమాన్య స్వరూపంలో ఎటువంటి మార్పు ఉండబోదని రసెల్ ఆడమ్ స్పష్టం చేశాడు. ఐపిఎల్ జట్ల యాజమాన్య హక్కుల మార్పిడికి సంబంధించి బిసిసిఐ గతంలోనే కొన్ని కఠినమైన నియమ నిబంధనలు విధించింది. ఐపిఎల్‌లో ఏ జట్టయినా తమ వాటాను పూర్తిగా గానీ లేక పాక్షికంగా గానీ ఇతరులకు బదిలీ చేసేటట్లయితే ఆ విషయాన్ని ముందుగానే బిసిసిఐకి తెలియజేయాలని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే డియాజియో ఆధీనంలోని యునైటెడ్ స్పిరిట్స్ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఆర్‌సిఎస్‌పిఎల్ యాజమాన్య స్వరూపంలో ఎటువంటి మార్పు జరగలేదని ఆ సంస్థ పేర్కొంది.