క్రీడాభూమి

భారత క్రికెటర్లకు డీఎన్‌ఏ పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: నిషిద్ధ మాదక ద్రవ్యాలు, ఉత్ప్రేరకాలను వాడారా? లేదా? అని తెలుసుకోవడానికి నిర్వహించే డోప్ పరీక్షకు ససేమిరా అంటున్న భారత క్రికెటర్లు డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమవుతున్నారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే ఇందుకు రంగం సిద్ధం చేసిందని, భువనేశ్వర్ కుమార్ వంటి కొంత మంది ఆటగాళ్లకు పరీక్షలను కూడా పూర్తి చేసిందని సమాచారం. అన్ని ఫార్మాట్స్‌లోనూ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీ జట్టులోని ప్రతి ఒక్కరి ఫిట్నెస్‌పైనా దృష్టి కేంద్రీకరించాడు. దీనితో గతంతో పోలిస్తే ఇప్పుడు ఫిట్నెస్ స్థాయిని నిర్ధారించడానికి వివిధ రకాల పరీక్షలు ముమ్మరమయ్యాయి. జట్టు ట్రైనర్ శంకర్ బసు సూచన మేరకు ఆటగాళ్లకు డీఎన్‌ఏ పరీక్షలు జరపాలని బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తన పేరును వెల్లడించవద్దని కోరిన బోర్డు అధికారి ఒకరు ఈ సమాచారాన్ని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. భువనేశ్వర్ ఇది వరకే డీఎన్‌ఏ పరీక్ష చేయించుకున్నాడని, నివేదికల ఆధారంగా ఆహారం, వ్యాయామంలో కొన్ని మార్పులు చేసుకోవడంతో, చాంపియన్స్ ట్రోఫీ నుంచి మొదలు పెడితే, ఇప్పటి వరకూ నిలకడగా రాణిస్తున్నాడని ఆ అధికారి వివరించాడు.
ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు..
డీఎన్‌ఏ పరీక్ష ద్వారా ఒక మనిషికి ఎన్ని క్యాలరీల శక్తి అవసరమవుతుంది? అందుకు ఏం చేయాలి? ఆహారం, వ్యాయామం తదితర అంశాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోవాలి? వంటి అంశాలపై స్పష్టత వస్తుంది. అంతేగాక, శ్రమను ఓర్చుకునే స్థాయిని కూడా తెలుసుకోవచ్చు. క్రికెటర్లకు ఈ పరీక్షను జరపడం ద్వారా, వారి శారీరక దారుఢ్యంపై ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఆ తర్వాత వారికి అవసరమైన రీతిలో వ్యాయామాలను ఖరారు చేయడానికి వీలవుతుంది. అందుకే, క్రికెటర్లందరికీ డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని బీసీసీఐ తీర్మానించినట్టు సమాచారం. ఈ పరీక్షలకుగాను ఒక్కో ఆటగాడిపై సుమారు 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చవుతుంది. ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయ వనరులున్న క్రీడా సంస్థగా ఎదిగిన బీసీసీఐకి ఇది భారీ మొత్తం కాదనేది వాస్తవం.

*
సహచరులు జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌తో కలిసి రొటీన్ వామప్ చేస్తున్న భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (ఎడమ నుంచి రెండు/ ఫైల్ ఫొటో)