క్రీడాభూమి

విజయంపై కనే్నసిన దక్షిణాఫ్రికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన టి-20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లో భారీ స్కోరును నమోదు చేసినప్పటికీ అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయంపై కనే్నసింది. అఫ్గానిస్థాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో గెలవకపోతే నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలకు ప్రమాదంలో పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుంది. ఫఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా శుక్రవారం మ్యాచ్‌లో 4 వికెట్లకు 229 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, బౌలర్ల వైఫల్యానికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ నైపుణ్యం తోడుకావడంతో ఎవరూ ఊహించని రీతిలో ఓటమిపాలైంది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌ని మార్గంగా ఎంచుకుంది.
మలింగ స్థానంలో వాండర్సే
మోకాలి గాయంతో బాధపడుతున్న లసిత్ మలింగ టి-20 వరల్డ్ కప్ టోర్నీలో కొనసాగే అవకాశం లేదని నిర్ధారణ కావడంతో అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సేను జట్టులోకి తీసుకున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సానుకూలంగా స్పందించింది. కాగా, ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఢీకొంటున్న లంక అన్ని రంగాల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిస్తే తప్ప విజయం సాధించడం కష్టం. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను ఎంత త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే విజయావకాశాలు అంత మెరుగవుతాయని లంకకు తెలుసు. అందుకే, బౌలర్లు అతనినే లక్ష్యంగా చేసుకోవడం ఖాయం. భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయన్న ఉద్దేశంతో ఫాస్ట్ బౌలర్ మలింగ స్థానంలో స్పిన్నర్‌కు శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) అధికారులు స్థానం కల్పించారు. రంగన హెరాత్, తిసర పెరెరాతో వాండర్సే కూడా చేరితే లంక స్పిన్ విభాగం బలోపేతమవుతుంది.