క్రీడాభూమి

మహిళల టి-20 వరల్డ్ కప్ భారత్‌ను ముంచేసినవర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహిళల టి-20 వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ విజయావకాశాలను వర్షం దెబ్బతీసింది. మ్యాచ్‌ని అర్ధాంతరంగా నిలిపివేసే సమయానికి, డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం పాకిస్తాన్ రెండు పరుగుల ఆధిక్యంలో ఉందని పేర్కొంటూ అంపైర్లు ఆ జట్టునే విజేతగా ప్రకటించారు. టాస్ గెలిచిన పాక్ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 96 పరుగులు చేసింది. వాతావరణంతోపాటు పిచ్ తీరు కూడా బ్యాట్స్‌విమెన్‌కు ఏమాత్రం అనుకూలించలేదు. ఫలితంగా ప్రతి పరుగు కోసం మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత్ చాలా కష్టపడాల్సి వచ్చింది. వేదా కృష్ణమూర్తి 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మిథాలీ, హర్మన్‌ప్రీత్ కౌర్ చెరి 16 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో ఆనమ్ అమీర్ అద్భుత ప్రతిభ కనబరచింది. ఆమె నాలుగు ఓవర్లలో కేవలం తొమ్మిది పరుగులిచ్చి ఒక వికెట్ కూల్చింది. అస్మావియా ఇక్బాల్ 13 పరుగులకు ఒకటి, సనా మీర్ 14 పరుగులకు ఒకటి చొప్పున వికెట్లు సాధించారు. కేవలం 76 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ కూడా స్కోరును వేగంగా పెంచలేకపోయింది. అయితే, రన్‌రేట్ భారత్ కంటే కొంచెం మెరుగ్గా కొనసాగింది. 16 ఓవర్లు ముగిసే సమయానికి ఈ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు. ఆతర్వాత ఆటను కొనసాగించే అవకాశం లేకపోయింది. దీనితో, డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరించి పాక్ రెండు పరుగుల తేడాతో గెలిచినట్టు అంపైర్లు ప్రకటించారు.