క్రీడాభూమి

14 ఏళ్ల తర్వాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సుమారు 14 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండియన్ వెల్స్ పిఎన్‌బి పరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్ టైటిల్ వేటను కొనసాగిస్తున్నది. ఒకటిన్నర దశాబ్దాలు ఈ టోర్నీకి దూరంగా ఉన్న సెరెనా గత ఏడాది సెమీ ఫైనల్ మ్యాచ్ నుంచి మోకాలి గాయం కారణంగా వైదొలగింది. ఈ ఏడాది టైటిల్ వేటలో పడింది. సెమీ ఫైనల్‌లో ఆమె 6-4, 7-6 స్కోరుతో అగ్నీస్కా రద్వాన్‌స్కాపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో కరోలినా ప్లిస్కోవాను 7-6, 1-6, 6-2 తేడాతో ఓడించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ విక్టోరియా అజరెన్కాతో టైటిల్ పోరుకు సెరెనా సిద్ధమైంది. ప్రస్తుత ఫామ్ నుంచి గణాంకాల వరకూ ఏ కోణంలో చూసినా అజరెన్కాపై ఆమెకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకూ అజరెన్కాను 20 పర్యాయాలు ఎదుర్కొన్న సెరెనా 17 విజయాలను సాధించింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లో ఓడింది.

స్విస్ ఓపెన్ బాడ్మింటన్
టైటిల్ దిశగా సైనా
బసెల్, మార్చి 19: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న స్విస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ దిశగా దూసుకెళుతున్నది. కాలి గాయం కారణంగా ఇటీవల కాలంలో పలు టోర్నీలకు దూరమైన సైనా ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ క్రమంగా వెనుకబడుతూ ఇప్పుడు ఆరో స్థానానికి చేరింది. అయితే, ఈ టోర్నీలో ఆమె మళ్లీ ఫామ్‌లోకి రావడం అభిమానులకు ఊరటినిస్తోంది. క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన సయాకా సతోను 13-21, 21-15, 21-14 తేడాతో ఓడించి సెమీ ఫైనల్ చేరిన సైనా తన కెరీర్‌లో మూడోసారి స్విస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశాలను మెరుగుపరచుకుంది. ఫైనల్‌లో స్థానం కోసం ఆమె తన చిరకాల ప్రత్యర్థి వాంగ్ ఇహాన్‌ను ఢీ కొంటుంది. ఇప్పటి వరకూ వీరిద్దరూ 13 పర్యాయాలు ఢీ కొంటే, సైనా నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేయగలిగింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. అతను క్వార్టర్ ఫైనల్‌లోటనొంగ్‌సక్ సయెన్‌సొంబూన్‌సక్‌పై 21-18, 22-24, 21-9 తేడాతో విజయం సాధించాడు.

రియో ఒలింపిక్స్‌కు
యోగేశ్వర్ క్వాలిఫై
అస్తానా, మార్చి 19: భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో 65 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో పోటీపడిన అతను ఫైనల్ రౌండ్‌కు చేరడం ద్వారా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. ఇప్పటికే నర్సింగ్ యాదవ్ రియోకు అర్హత సంపాదించగా, రెండో రెజ్లర్‌గా యోగేశ్వర్ పోటీపడనున్నాడు.