క్రీడాభూమి

సోషల్ మీడియాలో సెరెనా హల్‌చల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓర్లియానా, నవంబర్ 18: బాయ్‌ఫ్రెండ్ అలెక్సిస్ ఒహానియన్‌తో వివాహానికి సంబంధించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఉంచిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రాడిఫ్ సంస్థ సహ భాగస్వామి అలెక్సిస్‌తో సుమారు రెండేళ్లుగా సెరెనా ప్రేమాయణం సాగిస్తున్నది. సెప్టెంబర్ ఒకటిన వీరికి కుమార్తె (అలెక్సిస్ ఒలింపియా) జన్మించింది. 2015 నుంచి సహజీవనం చేస్తున్న సెరెనా, ఒహానియన్ వచ్చేనెల వివాహం చేసుకోనున్నట్టు తొలుత ప్రకటించారు. అయితే, ఒర్లియానాలో వీరిద్దరూ కనిపించడం, కొంత మంది ప్రముఖులు అక్కడికి చేరుకోవడంతో, వివాహం వార్త మీడియాకు చేరింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే హాజరైన ఈ వివాహ వేడుకల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాన్‌టెంపరీ ఆర్ట్స్ సెంటర్‌లో ఈ పెళ్లి జరగడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఒర్లియానాకు సెలబ్రిటీలు రావడంగానీ, అక్కడ వివాహ వేడుకలు జరుపుకోవడంగానీ మునుపెన్నడూ జరగలేదు. అటు మీడియాకు, ఇటు లక్షలాది మంది అభిమానులకు దూరంగా ఉంటుంది కాబట్టే ఈ ప్రాంతాన్ని సెరెనా, ఒహానియన్ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. వీరి వివాహానికి హాజరైన వారిలో ఓగ్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ అన్నా వింటూర్, రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కార్డషియన్, నటి ఇవా లాంగోరియా, గాయని సియారా వంటి ప్రముఖులు ఉన్నారు. సుమారు రెండు మిలియన్ డాలర్లను వీరు ఖర్చుచేసినట్టు ‘ది డైలీ మెయిల్’ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్ల మధ్య, మీడియాను కూడా ఆహ్వానించకుండా సెరెనా, ఒహానియన్ ఓ ఇంటివారయ్యారు. తొలుత సెరెనా, ఆతర్వాత ఒహానియన్ వివాహ వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచారు.

చిత్రం..భర్త అలెక్సిస్ ఒహానియన్, కుమార్తె అలెక్సిస్ ఒలింపియాతో ప్రపంచ మాజీ నంబర్ వన్
టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్