క్రీడాభూమి

పోగ్బా ఫిట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 18: మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రెంచ్ మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బా తన ఫిట్నెస్‌ను నిరూపించుకున్నాడు. కాలి కండరాలు బెణకడంతో సుమారు రెండు నెలలు ఫుట్‌బాల్‌కు దూరమైన అతను ప్రీమియర్ లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూకాజిల్ యునైటెడ్‌పై ఒక గోల్ చేశాడు. ఈ మ్యాచ్‌ని మాంచెస్టర్ యునైటెడ్ 4-1 తేడాతో గెల్చుకుంది. పోగ్గా (54వ నిమిషం)తోపాటు ఆంథోనీ మార్షల్ (37వ నిమిషం), క్రిస్ స్మాలింగ్ (45వ నిమిషం), రోమెలూ లుకాకా (70వ నిమిషం) కూడా గోల్స్ సాధించారు. న్యూకాజిల్‌కు 14వ నిమిషంలోనే డ్విట్ గేల్ ద్వారా గోల్ లభించినప్పటికీ ఈ అవకాశాన్ని ఆ జట్టు నిలబెట్టుకోలేకపోయింది. మాంచెస్టర్ యునైటెడ్ విజృంభణకు అడ్డుకట్టవేయలేక ఓటమిపాలైంది. కాగా, ఇతర మ్యాచ్‌ల్లో క్రిస్టల్ ప్యాలెస్‌ను టొటెన్హమ్ 1-0, వాట్‌ఫోర్డ్‌ను ఎవర్టన్ 3-2, ఆర్సెనెల్‌ను మాంచెస్టర్ సిటీ 3-1 గోల్స్ తేడాతో ఓడించాయి.

చిత్రం..పాల్ పోగ్బా