క్రీడాభూమి

లంకకు ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంకకు భారత్‌పై చివరిసారి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 2010లో లభించింది. గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని లంక అందుకోగా, ఆతర్వాత ఎనిమిది టెస్టుల్లో భారత్‌కు మొదటి ఇన్నింగ్స్ లభించింది. ఏడేళ్ల తర్వాత లంక మరోసారి టీమిండియాపై ఆధిక్యాన్ని అందుకుంది.
*
కోల్‌కతా, నవంబర్ 19: భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అయితే, నాలుగు రోజుల ఆట పూర్తికావడంతో, ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తున్నది. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కట్టడి చేసిన శ్రీలంక ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు, ఆదివారం ఆటను కొనసాగించిన శ్రీలంక సరిగ్గా 200 పరుగుల వద్ద వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్‌విల్లా వికెట్‌ను కోల్పయింది. అతను 38 బంతుల్లో 35 పరుగులు చేసి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. భువనేశ్వర్ కుమార్ వేసన బంతికి దసున్ షణక (0) ఎల్‌బిగా ఔట్‌కాగా, కెప్టెన్ దినేష్ చండీమల్ వికెట్‌ను మహమ్మద్ షమీ పడగొట్టాడు. 57 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లతో 28 పరుగులు చేసిన అతను ఇచ్చిన క్యాచ్‌ని వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా ఎలాంటి పొరపాటు లేకుండా అందుకున్నాడు. ఎల్‌బి ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ, ఆ అవకాశాన్ని వినయోగించుకోలేకపోయిన దిల్వ్రాన్ పెరెరా 5 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. చివరిలో రంగన హెరాత్ అద్భుత పోరాటాన్ని కొనసాగించి, అర్ధ శతకాన్ని నమోదు చేయడంతో, శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేయగలిగింది. హెరాత్ 105 బంతులు ఎదుర్కొని, 67 పరుగులు చేసిన తర్వాత మహమ్మద్ షమీ క్యాచ్ పట్టగా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతని స్కోరులో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. సురంగ లక్మల్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద మహమ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కాగా, లాహిరు గామగే పరుగుల ఖాతాను తెరవకుండా నాటౌట్‌గా మిగిలాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ చెరి నాలుగు వికెట్లు పడగొట్టగా, ఉమేష్ యాదవ్‌కు రెండు వికెట్లు లభించాయి.
ధావన్ చేజారిన సెంచరీ
మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే 122 పరుగులు వెనుకబడిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ఆచితూచి మొదలుపెట్టింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ, శ్రీలంక బౌలింగ్‌కు దీటైన సమాధానమిచ్చారు. 116 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 94 పరుగులు చేసిన శిఖర్ ధావన్ దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తికాకుండానే దసున్ షణక బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. 166 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కూలింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన చటేశ్వర్ పుజారాతో కలిసి రాహుల్ నాలుగో రోజు ఆటను, వికెట్ నష్టానికి 171 పరుగుల వద్ద ముగించాడు. అతను 113 బంతులు ఎదుర్కొని 73, పుజారా 9 బంతుల్లో 2 చొప్పున పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్ లోటును భర్తీ చేసుకున్న భారత్ ఇప్పుడు 49 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా తొమ్మిది వికెట్లు చేతిలో మిగిలాయి. చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న కారణంగా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్టులో ఫలితం రావడం అసాధ్యం.
స్కోరుబోర్డు
భారత్ మొదటి ఇన్నింగ్స్: 59.3 ఓవర్లలో 172 ఆలౌట్ (చటేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా 29, రవీంద్ర జడేజా 22, మహమ్మద్ షమీ 24, సురంగ లక్మల్ 4/26, లాహిరు గామగే 2/59, దసున్ షణక 2/36, దిల్‌రువాన్ పెరెరా 2/19).
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 165): సదీర సమరవిక్రమ సి వృద్ధిమాన్ సాహా బి భువనేశ్వర్ కుమార్ 23, దిముత్ కరుణరత్నే ఎల్‌బి భువనేశ్వర్ కుమార్ 8, లాహిరు తిరిమానే సి విరాట్ కోహ్లీ బి ఉమేష్ యాదవ్ 51, ఏంజెలో మాథ్యూస్ సి లోకేష్ రాహుల్ బి ఉమేష్ యాదవ్ 52, దినేష్ చండీమల్ సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 28, నిరోషన్ డిక్‌విల్లా సి విరాట్ కోహ్లీ బి మహమ్మద్ షమీ 35, దసున్ షణక ఎల్‌బి భువనేశ్వర్ కుమార్ 0, దిల్‌రువాన్ పెరెరా సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 5, రంగన హెరాత్ సి మహమ్మద్ షమీ బి భువనేశ్వర్ కుమార్ 67, సురంగ లక్మల్ బి మహమ్మద్ షమీ 16, లాహిరు గామగే 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం 83.4 ఓవర్లలో 294 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-29, 2-34, 3-133, 4-138, 5-200, 6-201, 7-201, 8-244, 9-290, 10-294.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 27-5-88-4, మహమ్మద్ షమీ 26.3-5-100-4, ఉమేష్ యాదవ్ 20-1-79-2, రవిచంద్రన్ అశ్విన్ 8-2-13-0, విరాట్ కోహ్లీ 1.1-0-5-0, రవీంద్ర జడేజా1-0-1-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ 73 నాటౌట్, శిఖర్ ధావన్ సి నిరోషన్ డిక్‌విల్లా బి దసున్ షణక 94, చటేశ్వర్ పుజారా 2 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం 39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 171.
వికెట్ల పతనం: 1-166.
బౌలింగ్: సురంగ లక్మల్ 8-0-29-0, లాహిరు గామగే 9-0-47-0, దసున్ షణక 9.3-1-29-1, దిల్‌రువాన్ పెరెరా 10-1-41-0, రంగన హెరాత్ 3-0-25-0.
*
ఒక టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 2010 తర్వాత ఇదే మొదటిసారి. అప్పుడు దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గౌతం గంభీర్, వీరేందర్ సెవాగ్ తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్ 166 పరుగుల ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశారు.
*
చిత్రం..శిఖర్ ధావన్ *లోకేష్ రాహుల్