క్రీడాభూమి

పెరెరా ‘బ్రెయిన్ ఫేడ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 19: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ‘బ్రెయిన్ ఫేడ్’ ఉదంతం మరోసారి చోటు చేసుకుంది. ఈసారి శ్రీలంక ఆటగాడు దిల్‌రువాన్ పెరెరా ఈ వివాదంలో చిక్కాడు. ఎల్‌బి అప్పీల్‌పై రివ్యూకి వెళ్లే ముందు అను డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూడడం టీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిబంధలను అనుసరించి అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, దానిని మరోసారి సరి చూసుకోవాల్సిందిగా కోరే సమయంలో మైదానంలో ఉన్నవారి నుంచి మాత్రమే సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఫీల్డింగ్ చేస్తున్నట్టు జట్టు అంపైర్ డిసిషన్ రివ్యూ (డిఆర్‌ఎస్)కు వెళ్లాలనుకుంటే, ఆ జట్టు కెప్టెన్ మైదానంలో ఉన్న మిగతా ఆటగాళ్లను సంప్రదించవచ్చు. అదే విధంగా బ్యాట్స్‌మన్ అప్పీల్ చేయదలచుకుంటే, తనతో కలిసి క్రీజ్‌లో ఉన్న మరో బ్యాట్స్‌మన్‌తో చర్చించవచ్చు. అంతేగానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మైదానంలో లేని వారి నుంచి సలహాలు తీసుకోకూడదు. భారత్ పర్యటనలో భాగంగా బెంగళూరులో రెండో టెస్టు ఆడుతున్నప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ డిఆర్‌ఎస్‌కు అప్పీల్ చేయడానికి ముందు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూశాడు. అక్కడి నుంచి ఏవైనా సూచనలు వస్తాయేమోనని అనుకున్నాడు. ఈ వ్యవహారం పెద్ద దుమారానే్న రేపింది. స్మిత్ వైఖరిని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పు పట్టడంతో, ‘చీట్ గేట్’గా ఆ వివాదం సంచలనం సృష్టించింది. తాను డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూడడం తప్పేనని అంగీకరించిన స్మిత్ ఆ సమయంలో తనకు ఏమీ తోచలేదని చెప్పాడు. మెదడు పనిచేయలేదని, ఏం చేస్తున్నాన్నది తెలియకుండానే డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూశానని స్మిత్ వివరణ ఇచ్చుకున్నాడు. డిఆర్‌ఎస్ సమయంలో ‘బ్రెయిన్ ఫేడ్’ అన్నపదం అప్పటి నుంచే విస్తృత ప్రచారంలోకి వచ్చింది. కాగా, దిల్‌రువాన్ పెరెరా కూడా స్మిత్ మాదిరిగానే డిఆర్‌ఎస్ అప్పీల్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి, మరోసారి ‘బ్రెయిన్ ఫేడ్’ను తెరపైకి తెచ్చాడు. ఇన్నింగ్స్ 57వ ఓవర్‌ను వేసిన మహమ్మద్ షమీ సంధించిన ఒక బంతి దిల్‌రువాన్ పెరెరా ప్యాడ్స్‌కు తగిలింది. అతను వికెట్లకు అడ్డంగా ఉన్నాడన్న ఉద్దేశంతో షమీ అప్పీల్ చేశాడు. దీనిపై అంపైర్ నిగెల్ లాంగ్ సానుకూలంగా స్పందించి దిల్‌రువాన్ పెరెరాను ఎల్‌బిగా ఔటైనట్టు ప్రకటించాడు. తొలుత పెవిలియన్‌వైపు బయలుదేరిన దిల్‌రువాన్ పెరెరా ఆతర్వాత మనసు మార్చుకొని, డిఆర్‌ఎస్‌కు మొగ్గు చూపాడు. నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న రంగన హెరాత్‌ను సంప్రదించే ప్రయత్నం చేశాడు. అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూశాడు. అక్కడి నుంచి ఎవరైనా అతనికి సూచనలు చేశారా? లేదా? అన్నది స్పష్టంగా కనిపించలేదు. అయితే, డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూసిన తర్వాతే డిఆర్‌ఎస్‌కు అప్పీల్ చేయడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. అయితే, భారత కెప్టెన్ కోహ్లీగానీ, ఇతర ఆటగాళ్లుగానీ ఈ సంఘటనపై ఇంత వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

దిల్‌రువాన్ పెరెరాకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎవరూ సూచనలు చేయలేదని శ్రీలంక జట్టు మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సలహాలను అతను కోరలేదని, కాబట్టి డ్రెస్సింగ్ రూమ్ నుంచి సాయం అందే ప్రసక్తే లేదని తెలిపింది. పెరెరాపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.

చిత్రం..అంపైర్ నిగెల్ లాంగ్‌కు డిఆర్‌ఎస్ అప్పీల్ చేస్తున్న దిల్‌రువాన్ పెరెరా