క్రీడాభూమి

కోహ్లీ మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పాకిస్తాన్‌తో శనివారం జరిగిన హై వోల్టేజీ టి-20 వరల్డ్ కప్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. విరాట్ కోహ్లీ అసాధారణ ప్రతి భ మరోసారి టీమిండియాకు విజయాన్ని అందించాడు. 18 ఓవర్లలో 119 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 13 బం తులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆరు వికెట్ల తేడా తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసింది.
టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు అహ్మద్ షెజాద్, షర్జీల్ ఖాన్ చక్కటి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. మొదటి వికెట్‌కు 38 పరుగులు జోడించిన తర్వాత సురేష్ రైనా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి షర్జీల్ ఖాన్ అవుట్ కావడంతో పాక్ తొలి వికెట్ కూలింది. షర్జీల్ 24 బంతులు ఆడి, రెండు ఫోర్ల సాయంతో 17 పరుగులు చేశాడు. మరో ఎనిమిది పరుగుల తర్వాత రెండో ఓపెనర్ అహ్మద్ షెజాద్ కూడా పెవిలియన్ చేరాడు. 28 బంతుల్లో, మూడు ఫోర్లతో 25 పరుగులు చేసిన అతను జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రవీంద్ర జడేజా క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఒంటి చేత్తో జట్టును గెలిపించే సత్తావున్న కెప్టెన్ షహీద్ అఫ్రిదీ కేవలం ఎనిమిది పరుగులు చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ చక్కటి క్యాచ్‌ని అందుకోవడంతో వెనుదిరిగాడు. 60 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్‌ను చేజార్చుకుంది. కొంత సేపు భారత్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్ కలిసి జట్టు స్కోరును 100 పరుగుల మైలురాయిని దాటించారు. అక్మల్ 22 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్‌కాగా, మాలిక్ 26 పరుగులు సాధించి నెహ్రా బౌలింగ్‌లో అశ్విన్‌కు చిక్కాడు. పాకిస్తాన్ నిర్ణీత 18 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు సాధించే సమయానికి సర్ఫ్‌రాజ్ అహ్మద్ 8, మహమ్మద్ హఫీజ్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా పొదుపుగా బంతులు వేశాడు. అతను నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి ఒక వికెట్ కూల్చాడు. నెహ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, సురైష్ రైనా, హార్దిక్ పాండ్య తలా ఒక వికెట్ సాధించారు. బౌలింగ్‌కు దిగిన భారత బౌలర్లలో అశ్విన్ ఒక్కడికే వికెట్ లభించలేదు. పాక్ రన్‌రేట్ 6.55 పరుగులుకాగా, చివరి ఐదు ఓవర్లలో సగటున 10.20 పరుగులు చేయడంతో పాక్ కొంతైనా కోలుకోగలిగింది.
తొలి దెబ్బతీసిన అమీర్
లక్ష్య సాధనలో దూసుకెళ్లాలనుకున్న భారత్‌ను పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ తొలి దెబ్బతీశాడు. 10 పరుగులు చేసిన అతను షోయబ్ మాలిక్ క్యాచ్ పట్టగా, 14 పరుగుల స్కోరువద్ద అవుటయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (6)ను మహమ్మద్ సమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లో కదలకుండా నిలబడి థర్డ్‌మన్ దిశగా బంతిని తరలించేందుకు ప్రయత్నించి విఫలమై మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఆ తర్వాతి బంతికే సురేష్ రైనా వికెట్‌ను కూడా సమీ కూల్చాడు. బంతిని లెగ్ సైడ్‌లో కొట్టేందుకు అతను చేసిన ప్రయత్నం విఫలమైంది. కోహ్లీతో కలిసి నాలుగో వికెట్‌కు 7.2 ఓవర్లలో 61 జత కలిపిన యువరాజ్ సింగ్ 24 పరుగులు చేసి, వాహెబ్ రియాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, మహమ్మద్ సమీ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. 84 పరుగులకు భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బ్యాటింగ్ కు దిగిన ధోనీతో కలిసి మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ కోహ్లీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. మహమ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో ఒక భారీ సిక్స్‌ను కొట్టిన ధోనీ ఆ వెం టనే సింగిల్‌తో, భారత్ లక్ష్య ఛేదనను పూర్తి చేశాడు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ 37 బంతులు ఎ దుర్కొని 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 55 పరుగు లు సాధించాడు. ఈ మ్యాచ్‌కి ముందు టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఆడుతూ, లక్ష్యాన్ని ఛేదించే సమయాల్లో విరాట్ కోహ్లీ సగటున 78.10 పరుగులు చేశాడు. అతను ఛేజింగ్‌లో మొత్తం 17 ఇన్నింగ్స్‌లో 781 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 55 పరుగులతో నాటౌట్‌గా నిలవడం ద్వారా టి-20 ఇంటర్నేషనల్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు.

స్కోరుబోర్డు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: అహ్మద్ షెజాద్ సి రవీంద్ర జడేజా బి జస్‌ప్రీత్ బుమ్రా 25, షర్జీల్ ఖాన్ సి హార్దిక్ పాండ్య బి సురేష్ రైనా 17, షహీద్ అఫ్రిది సి విరాట్ కోహ్లీ, బి హార్దిక్ పాండ్య 8, ఉమర్ అక్మల్ సి మహేంద్ర సింగ్ ధోనీ బి రవీంద్ర జడేజా 22, షోయబ్ మాలిక్ సి అశ్విన్ బి ఆశిష్ నెహ్రా 26, సర్ఫ్‌రాజ్ అహ్మద్ 8 నాటౌట్, మహమ్మద్ హఫీజ్ 5 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 118.
వికెట్ల పతనం: 1-38, 2-46, 3-60, 4-101, 5-105.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 4-0-20-1, రవిచంద్రన్ అశ్విన్ 3-0-12-0, సురేష్ రైనా 4-0-32-1, రవీంద్ర జడేజా 4-0-20-1, సురేష్ రైనా 1-0-4-1, హార్దిక్ పాండ్య 2-0-25-1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి షోయబ్ మాలిక్ బి మహమ్మద్ అమీర్ 10, శిఖర్ ధావన్ బి మహమ్మద్ సమీ 6, విరాట్ కోహ్లీ 55 నాటౌట్, సురేష్ రైనా బి మహమ్మద్ సమీ 0, యువరాజ్ సింగ్ సి మహమ్మద్ సమీ బి వాహబ్ రియాజ్ 24, మహేంద్ర సింగ్ ధోనీ 13 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (15.5 ఓవర్లలో 4 వికెట్లకు) 119.
వికెట్ల పతనం: 1-14, 2-23, 3-23, 4-84.
బౌలింగ్: మహమ్మద్ అమీర్ 3-1-11-1, మహమ్మద్ ఇర్ఫాన్ 2.5-0-25-0, మహమ్మద్ సమీ 2-0-17-2, అఫ్రిదీ 4-0-25-0, షోయబ్ మాలిక్ 2-0-22-0, వాహెబ్ రియాజ్ 2-0-16-1.

రెండో ఓవర్‌లోనే అశ్విన్..
కోల్‌కతా: తొలి ఓవర్‌ను వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాతో వేయించిన కెప్టెన్ ధోనీ రెండో ఓవర్‌లోనే స్పిన్ అటాక్‌ను ఆరంభించడం విశేషం. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ఓవర్ వేశాడు. నెహ్రాతో రెండు ఓవర్లు వేయించిన తర్వాత జస్‌ప్రీత్ బుమ్రాను రంగంలోకి దింపాడు. అశ్విన్‌తో మూడో ఓవర్‌ను కూడా వేయించాడు. బుమ్రాను తప్పించి రవీంద్ర జడేజాకు బౌలింగ్ చేసే అవకాశాన్నిచ్చిన ధోనీ ఆ వెంటనే సురేష్ రైనాను ప్రయోగించాడు. మొత్తం మీద పాక్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ధోనీ వివిధ రకాలుగా ప్రయోగాలు చేశాడు. రైనా తన మొదటి ఓవర్ నాలుగో బంతిలో షర్జీల్ ఖాన్‌ను అవుట్ చేయడంతో ధోనీ ప్రయత్నం ఎనిమిదో ఓవర్‌లో ఫలించింది.

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇది ఎనిమిదో టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్. ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆడిన ఘనత నలుగురు క్రీడాకారులకు దక్కుతున్నది. మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, షహీద్ అఫ్రిదీ, షోయబ్ మాలిక్ ఈ ఘనతను అందుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌కి ముందు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో భారత్ ఆరు విజయాలను నమోదు చేసింది. పాకిస్తాన్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెల వ గలిగింది.

మాజీ కెప్టెన్లకు సన్మానం
కోల్‌కతా: పాకిస్తాన్, భారత మాజీ కెప్టెన్లు వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్, సునీల్ గవాస్కర్, సచిన్ తెండూల్కర్, వీరందర్ సెవాగ్‌లను మ్యాచ్‌కి ముందు జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సత్కరించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యారు. కాగా, పశ్చిమ బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హాజరుకాలేకపోయాడు.

వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా మారడంతో ఆట ఆలస్యంగా మొదలైంది. మైదానం మొత్తం కవర్లు కప్పి, త్వరగా ఆరడానికి సూపర్ సోకర్లను ఉపయోగించి కొంత వరకు నష్ట నివారణ చేయగలిగారు. వాతావరణ పరిస్థితులతోపాటు అప్పటికే పిచ్‌పై కొంత వరకూ తడి ఉండడంతో, బంతి దిశను ఊహించడం కష్టమవుతుంది. అందుకే, టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాత్మకంగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, వనే్డ వరల్డ్ కప్, టి-20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్‌తో తలపడిన ప్రతిసారీ భారత్ టాస్ గెలవడం విశేషం. వనే్డ వరల్డ్ కప్‌లో ఆరు పర్యాయాలు, టి-20 వరల్డ్ కప్‌లో నాలుగు పర్యాయాలు పాకిస్తాన్‌ను ఢీకొన్న భారత్ అన్నింటిలోనూ టాస్‌ను నెగ్గింది.

సన్మాన కార్యక్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్