క్రీడాభూమి

క్వార్టర్స్‌కు మరో నలుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, నవంబర్ 21: గౌహతిలో జరుగుతున్న ఏఐబీఏ మహిళల యూత్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఇప్పటికే రెండు పతకాలను ఖాయం చేసుకున్న మన దేశం నుంచి మంగళవారం మరో నలుగురు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. బాల్కన్ యూత్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌తో పాటు ఇంటర్నేషనల్ అహ్మెట్ కొమెర్ట్ టోర్నమెంట్‌లో రజత పతకాలను కైవసం చేసుకున్న భారత రైజింగ్ స్టార్ అంకుషితా బోరో 64 కిలోల విభాగం ప్రీ-క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో టర్కీకి చెందిన అలుక్ కాగ్లాను మట్టికరిపించి సునాయాసంగా విజయం సాధించగా, భారత్‌కు చెందిన శశి చోప్రా (57 కిలోల విభాగం), జ్యోతి గులియా (51 కిలోల విభాగం), నీతూ (48 కిలోల విభాగం) కూడా తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించారు. గోల్డెన్ గ్లోవ్ టోర్నమెంట్‌లో పసిడి పతకంతో సత్తా చాటుకున్న జ్యోతి గులియా మధ్యాహ్నం జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ఉక్రెయిన్‌కు చెందిన అనస్తాసియా లిసిన్‌స్కాను చిత్తుచేసి భారత్‌కు తొలి విజయాన్ని అందించగా, 57 కిలోల విభాగం ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో తైవాన్‌కు చెందిన రెండో సీడ్ బాక్సర్ లిన్ లి వెయి యిని మట్టికరిపించిన శశి చోప్రా పతకానికి మరో విజయం దూరంలో నిలిచింది. అలాగే బాల్కన్ యూత్ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన డిఫెండింగ్ చాంపియన్ నీతూ సాయంత్రం జరిగిన 48 కిలోల ప్రీ-క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో బల్గేరియాకు చెందిన ఎమీ మారీ తొదొరోవాపై విజయం సాధించింది. 38 దేశాలకు చెందిన 150 మందికి పైగా బాక్సర్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో నేహా యాదవ్ (+81 కిలోల విభాగం), అనుపమ (81 కిలోల విభాగం) సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లడంతో ఇప్పటికే భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌ను మన దేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి.

చిత్రాలు..ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపిస్తున్న శశి చోప్రా (ఎడమ వైపు)
*54 కిలోల విభాగం ప్రిలిమినరీ రౌండ్‌లో రష్యా బాక్సర్ ఇందిరా సుదబయెవాను చిత్తు చేసిన సాక్షి