క్రీడాభూమి

షూటింగ్ చాంపియన్‌షిప్‌లో శార్దూల్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: న్యూఢిల్లీలో జరుగుతున్న 61వ జాతీయ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల టీనేజర్ శార్దూల్ విహన్ ఒకే రోజు నాలుగు పసిడి పతకాలను కైవసం చేసుకుని పెను సంచలనం సృష్టించాడు. మంగళవారం ఇక్కడ డా.కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరిగిన పురుషుల సీనియర్, జూనియర్ డబుల్ ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్లలో పసిడి పతకాలను కైవసం చేసుకున్న అతను టీమ్ ఈవెంట్లలో సైతం అదే జోరును కొనసాగించి సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఆసియా చాంపియన్‌షిప్ మాజీ డబుల్ గోల్డ్ మెడలిస్టు అన్వర్ సుల్తాన్ వద్ద శిక్షణ పొందుతున్న శార్దూల్ పురుషుల ఫైనల్‌లో 78-76 పాయింట్ల తేడాతో ప్రస్తుత ప్రపంచ నెంబర్ వన్ డబుల్ ట్రాపర్ అంకుర్ మిట్టల్‌పై విజయం సాధించి సత్తా చాటుకున్నాడు. పురుషుల ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లలో 7-8 తేడాతో భారత్‌కు చెందిన అంతర్జాతీయ షూటర్ మహమ్మద్ అసబ్ కంటే వెనుకబడి రెండో స్థానంలో నిలిచిన శార్దూల్ ఆ తర్వాత అప్రతిహతంగా ముందుకుసాగి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం విశేషం. గత ఏడాది రష్యా రాజధాని మాస్కోలో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంలో నిలిచిన శార్దూల్ ప్రస్తుతం పురుషుల జూనియర్ ఈవెంట్ ఫైనల్‌లో 77-74 తేడాతో తన సహచరుడైన అంతర్జాతీయ షూటర్ శపథ్ భరద్వాజ్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించగా, పంజాబ్‌కు చెందిన సెహజ్‌ప్రీత్ సింగ్ 55 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత శార్దూల్ పురుషుల డబుల్ ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో తన రాష్ట్రానికే చెందిన అహ్వర్ రిజ్వీతో కలిసి మరో స్వర్ణాన్ని, పురుషుల జూనియర్ డబుల్ ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో అస్ఘర్ హుస్సేన్ ఖాన్‌తో కలసి మరో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.

చిత్రం..శార్దూల్ విహన్