క్రీడాభూమి

గట్టిపోటీనిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, నవంబర్ 22: ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో గట్టిపోటీనిస్తామని ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ ధీమా వ్యక్తం చేశాడు. బుధవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ట్రోఫీని నిలబెట్టుకొని తిరిగి వెళ్లాలన్నదే తమ లక్ష్యమని అన్నాడు. 2015లో, స్వదేశంలో ఆసీస్‌ను ఎదుర్కొన్న ఇంగ్లాండ్ 3-2 తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు 2013-14లో ఆస్ట్రేలియాకు వెళ్లి, 0-5 తేడాతో ఎదుర్కొన్న పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా తాజా సిరీస్‌ను ప్రతీకారానికి సరైన మార్గంగా ఎంచుకుంది. ఈనెల 23న ఇక్కడి గబ్బా మైదానంలో మొదలయ్యే మొదటి టెస్టుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్టు బేలిస్ ప్రకటించినప్పటికీ, ఇంగ్లాండ్‌కు విజయం అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం. 1988 నుంచి ఇప్పటి వరకూ ఈ మైదానంలో ఆస్ట్రేలియా ఒక్క టెస్టును కూడా ఓడలేదు. ఇంగ్లాండ్ 31 ఏళ్ల క్రితం చివరిసారి గబ్బాలో టెస్టును గెల్చుకుంది. నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలంటే ఆ జట్టు సర్వశక్తులు ఒడ్డక తప్పదు. ఈ మైదానంలో ఇంగ్లాండ్ మొత్తం 20 టెస్టులు ఆడింది. కేవలం నాలుగు మాత్రమే గెల్చుకుంది. 1930 దశంలో రెండుసార్లు, 1978-79లో ఒకసారి, 1986లో మరోసారి బ్రిస్బేన్ విజయాలను అందుకోగలిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గబ్బాలో ఆ జట్టుకు అందని ద్రాక్షగానే మారింది. అయితే, ఈసారి మొదటి టెస్టును సాధించి, శుభారంభం చేస్తామన్న నమ్మకం తనకు ఉందని బేలిస్ అన్నాడు. సహజంగా సిరీస్‌లో మొదటి టెస్టులోనే గెలవడం ద్వారా ప్రత్యర్థి జట్లపై ఆస్ట్రేలియా ఒత్తిడి తెస్తుందని, ఈసారి తాము అలాంటి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశాడు. ఆసీస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టడమే తమ ధ్యేయమని పేర్కొన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడం లేదని చెప్పాడు. ప్రపంచ మేటి జట్లలో ఆ జట్టు ఒకటని, పైగా స్వదేశంలో ఆడుతున్నందున సహజంగానే విజయావకాశాలు వారికే ఎక్కువగా ఉంటాయని తెలిపాడు. కానీ, ఎదుటి జట్టు బలాన్ని, శక్తిసామర్థ్యాలను చూసి బెదిరిపోవడం లేదని అన్నాడు. ఆస్ట్రేలియాకు గట్టిపోటీనిస్తామని, యాషెస్ ట్రోఫీతోనే స్వదేశానికి వెళతామని చెప్పాడు.