క్రీడాభూమి

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ యాషెస్ సంగ్రామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాషెస్ షెడ్యూల్

నవంబర్ 23-27: మొదటి టెస్టు (బ్రిస్బేన్).
డిసెంబర్ 2-6: రెండో టెస్టు (అడెలైడ్ ఓవల్).
డిసెంబర్ 14-18: మూడో టెస్టు (పెర్త్).
డిసెంబర్ 26-30: నాలుగో టెస్టు (మెల్బోర్న్).
జనవరి 4-8: చివరిదైన ఐదో టెస్టు (సిడ్నీ).

బ్రిస్బేన్, నవంబర్ 22: చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరోసారి మహా సంగ్రామానికి సిద్ధమయ్యాయి. క్రికెట్ ప్రపంచంలో ‘యాషెస్ సిరీస్’గా ప్రసిద్ధి చెందిన ఈ టెస్టు సిరీస్‌లో మొదటి మ్యాచ్ గురువారం నుంచి ఇక్కడి గబ్బా స్టేడియంలో ప్రారంభం కానుండగా, ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం తమ దేశానికి వచ్చిన ఇంగ్లాండ్‌ను 5-0 తేడాతో చిత్తుచేసిన ఆస్ట్రేలియా మరోసారి అదే తరహా ఫలితాన్ని రాబట్టే ప్రయత్నంలో పడింది. అంతేగాక, రెండేళ్ల క్రితం ఇంగ్లాండ్‌కు వెళ్లి 2-3 తేడాతో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకొని, మరోసారి ట్రోఫీని దక్కించుకోవాలన్న ఆలోచన కూడా ఆసీస్‌కు ఉంది. స్వదేశంలో జరుగుతున్న సిరీస్ కాబట్టి, సహజంగానే ఆస్ట్రేలియాకు హోం అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే, నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఆసీస్‌కు ఇప్పుడు లేవనే చెప్పాలి. 2013లో మిచెల్ జాన్సన్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను అల్లాడించాడు. గబ్బా స్టేడియంలో జరిగిన ట్టెలో తొమ్మిది వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియా 381 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేయడంలో కీలక భూమిక పోషించాడు. అంతేగాక, ఆసీస్‌కు క్లీన్‌స్వీప్‌ను అందించిన ఘనత కూడా అతనికే దక్కుతుంది. ప్రస్తుత జట్టులో మిచెల్ జాన్సన్ స్థాయి పేసర్ లేడు. అయితే, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జొష్ హాజల్‌వుడ్ త్రయాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, మిచెల్ జాన్సన్, జేమ్స్ ఫాల్క్‌నెర్, ర్యాన్ హారిస్ త్రయం కంటే స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. పైగా గబ్బా స్టేడియంలో 1988 నుంచి ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా ఒక్క టెస్టును కూడా కోల్పోలేదు. అదే రికార్డును స్మిత్ బృందం కొనసాగించే అవకాశాలున్నాయి. ప్రస్తుత కెప్టెన్ జో రూట్, మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ రూపంలో ఇంగ్లాండ్‌కు ఇద్దరు మేటి బ్యాట్స్‌మెన్ అండ ఉంది. వారిని కట్టడి చేయడంలో మిగతా ఇద్దరికంటే స్టార్క్‌పైనే ఆసీస్ జట్టు ఎక్కువగా ఆధారపడుతున్నది. మిచెల్ జాన్సన్ స్థాయిలో మెరుపు వేగంతో బంతులు వేయలేకపోయినప్పటికీ, స్టార్క్ కూడా సమర్థుడిగా పేరు తెచ్చుకున్నడు. పిచ్ తీరును, వాతావరణ పరిస్థితులను అతను ఎంత బాగా ఉపయోగించుకుంటాడనే విషయంపైనే ఆస్ట్రేలియా పేస్ అటాక్ స్థాయి ఆధారపడుతుంది.
ఒకప్పుడు ఇంగ్లాండ్ జట్టుకు మెంటర్‌గా వ్యవహరించిన డేవిడ్ సాకెర్ ఇప్పుడు ఆసీస్ బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బలహీనతల గురించి అతనికి బాగా తెలుసు. ఆసీస్ పేసర్లకు అతను అద్భుతమైన మార్గదర్శకం చేయడం ఖాయం. ఇది కూడా స్వదేశంలో ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆసీస్ బలాన్ని పెంచుతున్నిరు. ఇంగ్లాండ్ ఎక్కువగా ఆధారపడిన జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌కు వీరిద్దరు ఎంత వరకూ ఎదురొడ్డుతారనేది ముఖ్యం. ఉస్మాన్ ఖాజా, షాన్ మార్ష్ తదితరులు కూడా ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేస్తున్నారు. వీరిపై ఆధిపత్యాన్ని సంపాదించడం ఇంగ్లాండ్ బౌలర్లకు అసాధ్యం కాకపోయినా, సులభం మాత్రం కాదు.
హోరాహోరీ తప్పదు!
ఇంగ్లాండ్‌పై మొదటి టెస్టులో ఆస్ట్రేలియనే్ల ఫేవరిట్స్‌గా బరిలోకి దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ సిరీస్‌లో హోరాహోరీ పోరాటం తప్పదని నిపుణుల అంచనా. స్వదేశంలో మ్యాచ్‌లు ఆడడం, ఇంగ్లాండ్ జట్టు బలాబలాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే హోం వర్క్‌ను పూర్తి చేసుకోవడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశాలు. అయితే, నిలకడలేమి ఆ జట్టుకు వేధిస్తున్నది. ఏ ఆటగాడు ఎప్పుడు రాణిస్తాడో, ఎప్పుడు విపలమవుతాడో తెలియని పరిస్థితి. ఇటీవల కాలంలో జట్టు ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయన్నది వాస్తవం. సీఏ అధికారులతో కాంట్రాక్టుపై తలెత్తిన భేదాభిప్రాయాలకు ఇంకా పూర్తిగా తెరపడలేదు. యాషెస్ సిరీస్‌ను బహిష్కరిస్తామని ఒకానొక దశలో క్రికెటర్లు బెదిరించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యల నుంచి ఆస్ట్రేలియా ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. కాగా, ఇంగ్లాండ్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. కీలక ఆటగాడు, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఒక దాడి కేసులో విచారణను ఎదుర్కొంటున్న కారణంగా అందుబాటులో లేకపోవడం తప్ప ఆ జట్టును తీవ్రంగా వేధిస్తున్న సమస్యలు దాదాపుగా లేవనే చెప్పాలి.
అయితే, ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ జట్టును ఢీకొని నిలబడడం అనుకున్నంత సులభం కాదనేది అందరికీ తెలిసిన విషయమే. ఒంటి చేత్తో జట్టును గెలిపించే సత్తావున్న ఆటగాళ్లు ఆసీస్ జట్టులో చాలా మంది ఉన్నారు. ఒకరిద్దరు తమ స్థాయికి తగినట్టు రాణించినా ఇంగ్లాండ్‌కు సమస్యలు తప్పవు. కాగితంపై చూస్తే జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. చారిత్రక నేపథ్యం ఉన్న యాషెస్ సిరీస్‌ను ఇరు జట్లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో, ఐదు మ్యాచ్‌ల్లోనూ మైదానాలు యుద్ధ్భూమిని తలపించడం ఖాయం. ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిదైనా, పోటీ మాత్రం పతాక స్థాయికి చేరి, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.