క్రీడాభూమి

అసాధారణ క్రికెటర్ కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టి-20 వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించడంలో ప్రధాన భూమిక పోషించిన భారత స్టార్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లతోపాటు ఎంతో మంది ప్రముఖులు, అభిమానులను అతనిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో, కోహ్లీ 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈమ్యాచ్‌లో ఓడితే, భారత జట్టు పరువు పోగొట్టుకోవడంతోపాటు టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడేది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న కోహ్లీ ఈ ఏడాది తొమ్మిది ఇన్నింగ్స్‌లో 430 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. అతను టి-20 ఇంటర్నేషనల్స్‌లో సగటున 53.55 పరుగులు చేసి, అత్యుత్తమ సగటుగల బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. రెండో స్థానంలో ఉన్న ఆరోన్ ఫించ్ సగటు 39.82 పరుగులు. దీనిని బట్టి కోహ్లీ దూకుడు ఏ స్థాయిలో కొనసాగుతున్నదో ఊహించుకోవచ్చు.

విజయాల బాటలో విండీస్

చెన్నై/ బెంగళూరు, మార్చి 20: టి-20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం వెస్టిండీస్ అటు మహిళలు, ఇటు పురుషుల విభాగాల్లో విజయాలను నమోదు చేసింది. మహిళల విభాగంలో స్ట్ఫోనీ టేలర్ ఆల్ రౌండ్ ప్రతిభతో రాణించి, బంగ్లాదేశ్‌పై వెస్ట్టిండీస్‌కు 49 పరుగుల తేడాతో విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 4 వికెట్లకు 148 పరుగులు సాధించింది. హీలే మాథ్యూస్ 41, స్ట్ఫో నీ 40 చొప్పున పరుగులు చేశారు. అనంతరం బం గ్లాదేశ్ 18.3 ఓవర్లో 99 పరుగులకే ఆలౌటైంది. స్ట్ఫో నీ 13 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి, వెస్టిండీస్‌కు విజయాన్ని అందించింది.
పురుషుల విభాగంలో శ్రీలంకను ఢీకొన్న విండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసిం ది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వి కెట్లకు 122 పరుగులు చేయగా, విండీస్ 18.2 ఓవర్ల లో 3 వికెట్లు కోల్పోయ లక్ష్యాన్ని చేరింది. ఆండ్రీ ఫ్లె చర్ అజేయంగా 84 పరుగులు సాధించాడు.