క్రీడాభూమి

ఒత్తిడిని పెంచే రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్వహించే వనే్డ, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాకిస్తాన్‌తో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా అన్నింటిలోనూ విజయభేరి మోగించింది. ఇలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ, వీటి వల్ల ఒత్తిడి మరింతగా పెరుగుతుందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. భారత్‌పై ఐసిసి వరల్డ్ కప్ పోటీల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని పాకిస్తాన్‌పై ఎంతటి ఒత్తిడి ఉంటుందో, విజయ పరంపరలను కొనసాగించాలనే తీవ్రమైన ఒత్తిడి భారత్‌పైనా అదే స్థాయిలో ఉంటుందని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. ఈ వరుస విజయాలకు ఎప్పుడో ఒకసారి బ్రేక్ పడక తప్పదని వ్యాఖ్యానించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ గెలవడం సాధ్యం కాదుకదా అని ప్రశ్నించాడు. వరల్డ్ కప్‌లో ఆరు, టి-20 వరల్డ్ కప్‌లో ఐదు చొప్పున పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడిన భారత్ అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఈ అరుదైన రికార్డును సాధించడం పట్ల ధోనీ ఆనందం వ్యక్తం చేశాడు. తాజా మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఆటగాళ్లు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రశ్నించాడు.
కోహ్లీది ప్రత్యేక శైలి..
అందరి కంటే కోహ్లీది ప్రత్యేకమైన శైలి అని ధోనీ ప్రశంసించాడు. అందుకే అతను ప్రత్యేక ఆటగాడిగా గుర్తింపు సంపాదించాడని అన్నాడు. సవాళ్లను ఎదుర్కోవడం కోహ్లీకి చాలా ఇష్టమని, ఆ లక్షణమే అతనికి ప్రత్యేకతను సంపాదించిపెట్టిందని వ్యాఖ్యానించాడు. ఎలాంటి సవాలుకైనా ఎదురునిలుస్తాడని, ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తాడని అన్నాడు. ఫిట్నెస్ కోసం కోహ్లీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడని చెప్పాడు. జట్టులో కొంత మంది ఇటీవల కాలంలో వైఫల్యాలను ఎదుర్కొంటున్నారన్న విమర్శపై అతను స్పందిస్తూ ప్రతి ఆటగాడికీ ఎప్పుడో ఒకసారి బ్యాడ్ ప్యాచ్ తప్పదని ధోనీ అన్నాడు. అయితే, వైఫల్యాలను ఎదుర్కొనే కాలం ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నాడు. కెరీర్ ఆరంభం నుంచి చివరి వరకూ ఒకే విధంగా రాణించడం ఎవరికీ సాధ్యం కాదని అన్నాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ తిరిగి కోహ్లీ ఆటపై అతను ప్రశంసలు కురిపించాడు. కోహ్లీని ఎవరు ఎంతగా రెచ్చగొడితే వారిపై అతను అంత తీవ్రంగా విరుచుకుపడతాడని ధోనీ అన్నాడు. చాలా కష్టమైన సందర్భాల్లోనూ పరుగులు రాబట్టే శక్తిసామర్థ్యాలు అతనికి మాత్రమే ఉన్నాయని చెప్పాడు.
ఇలావుంటే, టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత జట్టు తర్వాతి మ్యాచ్‌ని 23వ తేదీన బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. 27న చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొంటుంది.