క్రీడాభూమి

ఇండియన్ వెల్స్ టెన్నిస్ విజేతలు జొకొవిచ్, అజరెన్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకొవిచ్ టైటిల్‌ను నిలబెట్టుకోగా, మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు చుక్కెదురైంది. విక్టోరియా అజరెన్కా సంచలన విజయాన్ని నమోదు చేసి విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో మిలోస్ రవోనిక్‌ను సెర్బియా స్టార్ జొకొవిచ్ 6-2, 6-0 తేడాతో చిత్తుచేశాడు. రవోనిక్‌తో అతను తలపడడం ఇది ఆరోసారి. 2013లో డేవిస్ కప్‌లో వీరిద్దరూ తొలిసారి ఢీకొన్నారు. ఆ మ్యాచ్‌లో గెలిచిన జొకొవిచ్ ఆతర్వాత కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. 2014లో అతను రోమ్ మాస్టర్స్ సెమీ ఫైనల్స్, ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్, పారిస్ మాస్టర్స్ ఫైనల్‌లో రవోనిక్‌ను చిత్తుచేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో మరోసారి రవోనిక్‌పై జొకొవిచ్ విజయాన్ని నమోదు చేశాడు. తాజాగా ఇండియన్ వెల్స్ ఫైనల్‌లో ఓడించడం ద్వారా తిరుగులేని వీరుడిగా నిలిచాడు. కెరీర్‌లో 62వ టైటిల్‌ను అందుకున్నాడు. అతని ఖాతాలో 11 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు కూడా ఉన్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న రవోనిక్ ఇండియన్ వెల్స్ ఫైనల్‌లో రాణించి, జొకొవిచ్‌పై మొదటి విజయాన్ని నమోదు చేయాలని ఉత్సాహపడ్డాడు. కానీ, ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేక చేతులెత్తేశాడు. ఈ టోర్నీలో జొకొవిచ్ మొదటి రౌండ్‌లో జాన్ ఫ్రాంటెంజిలోను 2-6, 6-1, 6-2, రెండో రౌండ్‌లో ఫిలిప్ కొల్చెర్బర్‌ను 7-5, 7-5, మూడో రౌండ్‌లో ఫెలిసియానో లొపెజ్‌ను 6-3, 6-3 తేడాతో ఓడించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో జో విల్‌ఫ్రైడ్ సొంగా నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైనప్పటికీ 7-6, 7-6 తేడాతో విజయం సాధించాడు. సెమీ ఫైనల్‌లో తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌పై 7-6, 6-2 ఆధిక్యంతో విజయభేరి మోగించాడు. ఫైనల్‌లో రవోనిక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 6-2, 6-0 స్కోరుతో గెలిచి, తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.
ఫైనల్‌లో ఓడిన కెనడా ఆటగాడు రవోనిక్ మొదటి రౌండ్‌లో ఇనిగో సెర్వాంటెస్‌ను 6-1, 6-3 తేడాతో ఓడించాడు. రెండో రౌండ్‌లో బెర్నార్డ్ టోమిక్‌పై మొదటి సెట్‌ను 6-2 తేడాతో గెల్చుకొని, రెండో సెట్‌లో 3-0 ఆధిక్యాన్ని సంపాదించాడు. ఈ దశలో గాయం కారణంగా టోమిక్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో రవోనిక్ మూడో రౌండ్ చేరాడు. మూడో రౌండ్‌లో థామస్ బెర్డిచ్‌ను 6-4, 7-6, క్వార్టర్ ఫైనల్‌లో గేల్ మోన్ఫిల్స్‌ను 7-5, 6-3, సెమీ ఫైనల్‌లో డేవిడ్ గోఫిన్‌ను 6-3, 3-6, 6-3 స్కోరుతో ఓడించి ఫైనల్ చేరాడు. అయితే, టైల్ పోరులో జొకొవిచ్‌ను ఢీకొని ఓటమిపాలయ్యాడు.

కొని తెచ్చుకున్న ఓటమి!

ఇండియన్ వెల్స్: మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఓటమిని కొనితెచ్చుకుంది. పదేపదే పొరపాట్లు చేసి మూల్యాన్ని చెల్లించుకుంది. హాట్ ఫేవరిట్‌గా ఫైనల్‌లో బరిలోకి దిగిన ఆమె అజెరెన్కా నుంచి తీవ్రమైన ప్రతిఘటనను ఊహించలేకపోయింది. ప్రత్యర్థి ఎదురుదాడికి దిగుతున్నదని గ్రహించిన తర్వాత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సి ఉండగా, అందుకు భిన్నంగా విఫలమైంది. సుమారు 14 సంవత్సరాల విరామం తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీలో ఆడుతున్న కారణంగా, టైటిల్ సాధించాలన్న ఆలోచన కూడా ఆమెను ఒత్తిడికి గురి చేసింది. ఫలితంగా మ్యాచ్‌ని కోల్పోయింది. కాగా, అమెరికా సూపర్ స్టార్ సెరెనాను అజరెన్కా ఢీకొనడం ఇది 21వ సారి. 17 పర్యాయాలు సెరెనా విజయభేరి మోగిస్తే, అజరెన్కా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్న సెరెనాను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ ఏమాత్రం తడబాటు లేకుండా ఆడిన ఈ బెలారస్ క్రీడాకారిణి సంచలన విజయాన్ని నమోదు చేసి, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ‘టాప్-10’లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె ఎనిమిదో ర్యాంక్‌లో ఉంది. ఇలావుంటే, ఇండియన్ వెల్స్‌లో సెరెనా మొదటి రౌండ్‌లో లారా సిగెమండ్‌ను 6-2, 6-1, రెండో రౌండ్‌లో యూలియా పుతిన్‌త్సెవాను 7-6, 6-0, మూడో రౌండ్‌లో కాతెరీన బొండరెన్కోను 6-2, 6-2 తేడాతో ఓడించింది. క్వార్టర్ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హాలెప్‌ను 6-4, 6-3 స్కోరుతో ఇంటిదారి పట్టించింది. సెమీ ఫైనల్‌లో తనకు గట్టిపోటీనిచ్చే అవకాశం ఉన్న అగ్నీస్కా రద్వాన్‌స్కాపై 6-4, 7-6 ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ విజయాలు సెరెనాను ఫేవరిట్‌గా నిలిపాయి. కానీ, ఫైనల్‌లో అజరెన్కా చేతిలో ఆమె 4-6, 4-6 స్కోరుతో ఓడింది.
మరోవైపు అజరెన్కా మొదటి రౌండ్‌లో జరినా దియాస్‌ను 6-3, 6-2, రెండో రౌండ్‌లో షువయ్
జాంగ్‌ను 6-4, 6-3, మూడో
రౌండ్‌లో ఆస్ట్రేలియా స్టార్ సమంతా స్టొసుర్‌ను 6-1, 4-6, 6-1 తేడాతో ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మగ్దలీన రిబరికొవాను 6-0, 6-0 ఆధిక్యంతో చిత్తుచేసింది. సెమీ ఫైనల్‌లో కరొలినా ప్లిస్కోవాపై 7-6, 1-6, 6-2 తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో ‘అండర్ డాగ్’ ట్యాగ్‌తో బరిలోకి దిగి, అనూహ్యంగా చెలరేగిపోయిన ఆమె సెరెనాను కూడా వరుస సెట్లలో చిత్తుచేసి కెరీర్‌లో 20వ టైటిల్‌ను అందుకుంది.