క్రీడాభూమి

ఆస్ట్రేలియాది అదే తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 1: ప్రత్యర్థుల్ని కించ పరచడం, విద్వేషపూరితమైన మాటలతో వెక్కిరించడం ఆస్ట్రేలియాకు అలవాటేనని, అందులో ఆశ్చపడాల్సిది ఏమీ లేదని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జో రూట్ వ్యాఖ్యానించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో శనివారం నుంచి కీలకమైన రెండో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో, శుక్రవారం అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తమ వికెట్‌కీపర్ జారీ బెయిర్‌స్టోను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, బ్యాట్స్‌మన్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ విమర్శించిన తీరు తమలో పట్టుదలను పెంచుతున్నదని చెప్పాడు. మొదటి టెస్టును 10 వికెట్ల తేడాతో గెల్చుకున్న తర్వాత స్మిత్, బాన్‌క్రాఫ్ట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంగ్లాండ్ కీపర్ బెయిర్‌స్టోకు కూలుతున్న వికెట్లు లెక్కించుకోవడానికి సమయం సరిపోలేదని వ్యాఖ్యానిస్తూ పగలబడి నవ్వారు. ఆ సంఘటనను రూట్ ప్రస్తావిస్తూ, ఆస్ట్రేలియా వైఖరి తమకు కొత్తకాదని అన్నాడు. మొదటి టెస్టు ఫలితాన్ని గురించి ఆలోచించడం లేదని, రెండో టెస్టులో గట్టిపోటీనిస్తామని చెప్పాడు.
అది వారి అలవాటే: స్మిత్
ప్రత్యర్థి జట్లను వెక్కించే అలవాటు ఇంగ్లాండ్ క్రికెటర్లకే ఉందని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. బెయిర్‌స్టో ఢీకొట్టి మరీ అభినందనలు తెలిపే విధానం చాలా వింతగా ఉంటుందని చెప్పాడు. అందుకే ఆ సంఘటనను తలచుకొని నవ్వుకున్నామే తప్ప, ఇంగ్లాండ్ క్రికెటర్లను కించ పరచలేదని అన్నాడు. నిజానికి ఆ జట్టులోని పేసర్లు స్లెడ్జింగ్‌కు ఎక్కువగా పాల్పడతారని ఆరోపించాడు. రెండో టెస్టులోనూ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశాడు.