క్రీడాభూమి

ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 2: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌ని 1-1గా డ్రా చేసుకున్న భారత్ రెండో మ్యాచ్‌లో మరో బలమైన జట్టు ఇంగ్లాండ్‌ను ఢీకొని, 2-3 తేడాతో ఓటమిపాలైంది. చివరి వరకూ పోరాడినప్పటికీ ఇంగ్లాండ్ వ్యూహానికి భారత్ చిత్తయంది. 25వ నిమిషంలో ఆ జట్టు వ్యూహం ఫలించింది. డేవిడ్ గుడ్‌ఫీల్డ్ ఇంగ్లాండ్ తరఫున గోల్స్ ఖాతా తెరిచాడు. ప్రథమార్ధం ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం ఆరంభంలోనే శామ్ వార్డ్ గోల్ చేసి, ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. దీనితో ఎదురుదాడికి దిగిన భారత్‌కు 47వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్, 50వ నిమిషంలో రూపీందర్‌పాల్ సింగ్ గోల్స్ అందించి, స్కోరును సమం చేశారు. అయతే, చివరిలో శామ్ వార్డ్ మరో గోల్ చేసి, ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు.
అర్జెంటీనాకు బెల్జియం షాక్
పటిష్టమైన అర్జెంటీనాకు బెల్జియం షాకిచ్చింది. 3-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ జట్టు తరఫున లోయిక్ లుపార్ట్ (9వ నిమిషం), అమోరీ కేస్టర్స్ (51వ నిమిషం), టామ్ బూన్ (56వ నిమిషం) గోల్స్ సాధించారు. అర్జెంటీనాకు మైకో కాసెలా 52వ నిమిషంలో, గంజాలెజ్ పిలాట్ 57వ నిమిషంలో గోల్స్ అందించారు. కాగా, మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై స్పెయిన్ కూడా 3-2 ఆధిక్యంతోనే గెలిచింది. పవో క్యుమెదా (15వ నిమిషం), ఎన్రిక్ గంజాలెజ్ (35వ నిమిషం), డిగో అరానా (39వ నిమిషం) స్పెయిన్ తరఫున గోల్స్ నమోదు చేయగా, నెదర్లాండ్స్‌కు లార్స్ బాల్ (37వ నిమిషం), మిర్కో ప్రూసెర్ (55వ నిమిషం) ద్వారా గోల్స్ లభించాయి. భారత్‌తో తొలి మ్యాచ్‌ని 1-1గా డ్రా చేసుకున్న ఆస్ట్రేలియా తన రెండో మ్యాచ్‌ని కూడా డ్రాగానే ముగించింది. జర్మనీతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఈ జట్టు సమవుజ్జీ (2-2)గా నిలిచింది. ఆస్ట్రేలియా తరపున బ్లేక్ గోవర్స్ 39, ఆరోన్ క్లీన్స్‌మిడ్ 49 నిమిషాల్లో, జర్మనీ తరఫున మార్కో మిల్ట్‌కో 7, మార్టిన్ హానెర్ 58 నిమిషాల్లో గోల్స్ సాధించారు.