క్రీడాభూమి

ఆస్ట్రేలియా 4/209

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 2: ఇంగ్లాండ్‌తో శనివారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లకు 209 పరుగులు చేసింది. యాషెస్ సిరీస్ చరిత్రలో మొట్టమొదటిసారి డే/నైట్ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మొదట్లోనే కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 33 పరుగుల వద్ద రనౌటైన అతను 41 బంతుల్లో 10 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 102 బంతులు ఎదుర్కొని, 47 పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకు చిక్కాడు. అర్ధశతకం సాధించిన ఉస్మాన్ ఖాజా సెంచరీని పూర్త చేయలేకపోయాడు. 112 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 53 పరుగులు చేసిన అతనిని జేమ్స్ విన్స్ క్యాచ్ పట్టగా జేమ్స్ ఆండర్సన్ ఔట్ చేశాడు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మంచి ఫామ్‌లో ఉన్నట్టు కనిపించినప్పటికీ, 40 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద క్రిస్ ఓవర్టన్ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయలేక, క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌నుమొలుపెట్టిన ఓవర్టన్‌కు తొలి వికెట్‌గా స్మిత్ చిక్కడం విశేషం. మొదటి రోజున 81 ఓవర్ల ఆట సాధ్యంకాగా, ఆస్ట్రేలియా నాలుగు వికెట్లకు 209 పరుగులు చేసింది. పీటర్ హ్యాండ్స్‌కోమ్ 36, షాన్ మార్ష్ 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జేమ్స్ ఆండర్సన్, క్రిస్ వోక్స్, క్రెగ్ ఓవర్టన్ తలా ఒక్కో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 81 ఓవర్లలో 4 వికెట్లకు 209 (డేవిడ్ వార్నర్ 47, ఉస్మాన్ ఖాజా 53, స్టీవెన్ స్మిత్ 40, పీటర్ హ్యాండ్స్‌కోమ్ 36 నాటౌట్, జేమ్స్ ఆండర్సన్ 1/45, క్రిస్ వోక్స్ 1/50).