క్రీడాభూమి

అదే జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: శ్రీలంకతో నాగపూర్‌లో జరిగిన రెండో టెస్టులో మాదిరిగానే, ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శనివారం ప్రారంభమైన చివరి, మూడో టెస్టులోనూ టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తున్నది. అదే జోరును కొనసాగిస్తూ, మొదటి రోజు ఆట పూర్తయ్యే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 371 పరుగులు సాధించి, భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతున్నది. కోహ్లీ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, అజేయ సెంచరీతో అభిమానులను అలరించగా, మురళీ విజయ్ కూడా సెంచరీతో కదంతొక్కాడు. వీరిద్దరి ప్రతిభ ముందు లంక బౌలింగ్ వెలవెలపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 42 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్‌ను కోల్పోయింది. 35 బంతుల్లో 23 పరుగులు చేసిన అతను దిల్‌రువాన్ పెరెరా బౌలింగ్‌లో సురంగ లక్మల్ అసాధారణ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. చటేశ్వర్ పుజారా కూడా 23 పరుగులు చేసి, సదీర సమరవిక్రమ క్యాచ్ అందుకోగా, లాహిరు గామగే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 78 పరుగులకు రెండు వికెట్లు కూలిన దశలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనర్ మురళీ విజయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ లంక బౌలింగ్‌ను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా దూకుడుగా ఆడడంతో స్కోరుబోర్డు వేగాన్ని పుంజుకుంది. మూడో వికెట్‌కు 283 పరుగులు జోడించిన తర్వాత విజయ్ అవుటయ్యాడు. 267 బంతుల్లో అతను 13 బౌండరీల సాయంతో 155 పరుగులు చేసి, లక్షన్ సండాకన్ బౌలింగ్‌లో క్రీజ్ నుంచి ముందుకు దూసుకొచ్చి, వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా స్టంప్ చేయగా పెవిలియన్ చేరాడు. అజింక్య రహానే వైఫల్యాల బాటను వీడకుండా, మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. ఐదు బంతులు ఎదుర్కొని, కేవలం ఒక పరుగు చేసిన అతను లక్షన్ సండాకన్ బౌలింగ్‌లోనే నిరోషన్ డిక్‌విల్లా స్టంప్ చేయగా ఔటయ్యాడు. 90 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లకు 371 పరుగులు సాధించింది. అప్పటికి కోహ్లీ 156 (186 బంతులు, 16 ఫోర్లు), రోహిత్ శర్మ 6 (14 బంతులు, ఒక ఫోర్) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. లంక బౌలర్లలో లక్షన్ సండాకన్ రెండు వికెట్లు పడగొట్టగా, లాహిరు గామగే, దిల్‌రువాన్ పెరెరాకు చెరొక వికెట్ లభించింది.

చిత్రం..సెంచరీ హీరో మురళీ విజయ్