క్రీడాభూమి

నిలకడ లేకుంటే కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 3: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్‌లో భాగంగా రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీని ఢీ కొంటున్న భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిలకడ లేకపోతే, సమస్యలు తప్పవని స్పష్టం కావడంతో, జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. డిఫెండింగ్ చాంపియన్, విశ్వ విజేత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ని డ్రా చేసుకున్నప్పటికీ, తర్వాతి మ్యాచ్‌ని ఇంగ్లాండ్ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సోమవారం జర్మనీతో జరిగే మ్యాచ్ కోసం అన్ని జాగ్రత్తలతో భారత్ సిద్ధం కావాల్సి ఉంది. పొరపాట్లు పునరావృతమైతే మరోసారి పరాభవం తప్పదు.
స్పెయిన్ చిత్తు
బెల్జియంతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో స్పెయిన్ చిత్తయింది. బెల్జియం ఐదు గోల్స్ సాధించగా, స్పెయిన్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. నెదర్లాండ్స్, అర్జెంటీనా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి మూడు గోల్స్ సాధించాయి.