క్రీడాభూమి

కోహ్లీ మరో ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: హోం గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు డబుల్ సెంచరీ సాధించి, భారత్‌కు భారీ స్కోరు అందించాడు. దీనితో ఏడు వికెట్లకు 536 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న చివరి, మూడో టెస్టులో రెండో రోజు ఆటను నాలుగు వికెట్లకు 371 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో కొసాగించిన భారత్ 500 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఐదో వికెట్‌కు కోహ్లీతో కలిసి 135 పరుగులు జోడించిన అతను 102 బంతుల్లో 65 పరుగులు చేశాడు. లక్షన్ సండాకన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స్‌కు తెరపడింది. రవిచంద్రన్ అశ్విన్ నాలుగు పరుగులకే ఔట్‌కాగా, 287 బంతులు ఎదుర్కొని, 25 ఫోర్లతో 243 పరుగులు చేసిన కోహ్లీని లక్షన్ సండాకన్ ఎల్‌బిగా ఔట్ చేశాడు. వికెట్లకు అడ్డంగా దొరికిపోయిన కోహ్లీ బంతి తొలుత బ్యాట్‌కు తగిలి ఉంటుందని నమ్మాడు. దీనితో ఔట్‌నట్టు అంపైర్ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రివ్యూను కోరాడు. అందులో అతను బంతికి, స్టంప్స్‌కు మధ్య నిలిచినట్టు స్పష్టం కావడంతో పెవిలియన్ చేరక తప్పలేదు. కాలుష్య సమస్య ఉందంటూ లంక క్రికెటర్లు కొంత సేపు ఆటకు అంతరాయం కలిగించడం కోహ్లీ ఏకాగ్రతను దెబ్బతీసింది. ఆ క్రమంలోనే అతను ఔటయినట్టు కనిపిస్తున్నది. కాగా, 127.5 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లకు 523 పరుగులు చేసింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు కోహ్లీ ప్రకటించాడు. అప్పటికి వృద్ధిమాన్ సాహా 9, రవీంద్ర జడేజా 5 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన శ్రీలంక, రెండో రోజు ఆటను నిలిపి వేసే సమయానికి 44.3 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసింది. మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి దిముత్ కరుణరత్నే ఔటయ్యాడు. 14 పరుగుల వద్ద ధంజయ డి సిల్వ కూడా వెదరిగాడు. ఒక పరుగు చేసిన అతను ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. అనంతరం మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (57 నాటౌట్), కెప్టెన్ దినేష్ చండీమల్ (25 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు.

చిత్రం.. రికార్డు డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీ