క్రీడాభూమి

వనే్డ క్రికెటర్లకు లంక మంత్రి బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, డిసెంబర్ 5: భారత్‌తో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ కోసం బయలుదేరిన తొమ్మిది మంది క్రికెటర్ల ప్రయాణానికి శ్రీలంక క్రీడా మంత్రి దయాసిరి జయశేఖర బ్రేక్ వేసినట్టు సమాచారం. పేరు చెప్పడానికి ఇష్టపడని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ)కి చెందిన ఒక సభ్యుడు ఎఎఫ్‌పీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. తిసర పెరెరా నాయకత్వం వహిస్తున్న వనే్డ జట్టును ఎస్‌ఎల్‌సీ ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌లో టెస్టు సిరీస్ ఆడుతున్న సభ్యుల్లో కొందరు వనే్డ సిరీస్‌కు కూడా ఎంపిక కాగా, తిసర పెరెరా సహా తొమ్మిది మంది క్రికెటర్లు, ఉపుల్ తరంగ, దనుష్క గుణతిలక, అసెల గుణరత్నే, చతురంగ డి సిల్వ, సచిత్ పథిరన, దుష్మంత చమీరా, నవాన్ ప్రదీప్, జెఫ్రీ వాండర్సే మంగళవారం తెల్లవారు ఝామున విమానంలో భారత్‌కు బయలుదేరాల్సి ఉంది. సోమవారం రాత్రి వారు కొలంబో విమానాశ్రయం చేరుకున్న తర్వాత, బయలుదేరవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశం రావడంతో, తమ ప్రయాణాన్ని విరమించుకున్నారు. జట్టు ఎంపిక పట్ల జయశేఖర అసంతృప్తితో ఉన్నాడని, అందుకే, అతను ఆటగాళ్లను భారత్‌కు బయలుదేరకుండా ఆపాడని ఎస్‌ఎల్‌సీ సభ్యుడు తెలిపాడు. 1973లో సవరించిన చట్టం ప్రకారం, జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టులో మార్పులు చేర్పులు చేసే అధికారం క్రీడా మంత్రికి ఉంటుంది. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని, జట్టులో ఒకటిరెండు మార్పులు చేయడానికి జయశేఖర సిద్ధమైనట్టు సమాచారం. అయితే, ఇది నిజమేనా లేక మరేదైనా కారణం వల్ల శ్రీలంక వనే్డ క్రికెటర్ల ప్రయాణం వాయిదా పడిందా అన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై ఎస్‌ఎల్‌సీ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
చండీమల్‌కు మొండిచేయి
టెస్టు జట్టు కెప్టెన్ దినేష్ చండీమల్‌కు శ్రీలంక జాతీయ సెలక్టర్లు మొండి చేయి చూపారు. భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు అతనిని ఎంపిక చేయలేదు. చివరిదైన మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నప్పటికీ, అతని పట్ల సెలక్టర్లు మొగ్గు చూపకపోవడం విచిత్రం. ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న వారిలో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా, సదీర సమరవిక్రమ, లాహిరు తిరిమానే, ఏంజెలో మాథ్యూస్, సురంగ లక్మల్ వనే్డ జట్టులో చోటు సంపాదించుకున్నారు. కెప్టెన్ తిసర పెరెరాసహా మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్లు వీరితో చేరతారు.