క్రీడాభూమి

రొమెయూ కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 5: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో అర్జెంటీనాను స్పెయిన్ 2-1 తేడాతో ఓడించింది. రెండు బలమైన జట్ల మధ్య జరిగిన పోరు కావడంతో, ఈ మ్యాచ్ ఆద్యంతరం ఆసక్తికరంగా సాగుతుందని అభిమానులు ఆశించారు. కానీ, వారి అంచనాలకు భిన్నంగా, ఎక్కువ శాతం సమయం ఇరు జట్ల డిఫెన్స్ ప్లేతోనే సరిపోయింది. జొసెప్ రొమెయూ కీలక గోల్ చేసి, స్పెయిన్‌ను గెలిపించడం మినహా ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మ్యాచ్ 21వ నిమిషంలోనే మథియాస్ పరెడెస్ ద్వారా గోల్‌ను సంపాదించుకున్న అర్జెంటీనా, ఆ వెంటనే వ్యూహాత్మకంగా డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చింది. బంతిని ఎక్కువ సమయం తమ ఆధీనంలోనే ఉంచుకొని, అర్జెంటీనా ఆటగాళ్లు కాలక్షేపం చేశారు. దీనితో ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం మొదట్లో తిరిగి అదే తరహా ఆట కనిపించింది. అయితే, 50వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు పవూ క్యుమెదా ఈక్వెలైజర్‌ను అందించాడు. తర్వాత కొంత సేపు ఇరు జట్లు రక్షణాత్మకంగా ఆడడంతో, మ్యాచ్ డ్రా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, 59వ నిమిషంలో రొమెయూ గోల్ చేసి, స్పెయిన్‌ను విజయపథంలో నడిపాడు. ఆరంభంలోనే గోల్ చేసినప్పటికీ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అర్జెంటీనా పరాజయాన్ని చవిచూసింది.
బెల్జియం ఆధిపత్యం
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ జట్టుకు 19వ నిమిషంలో లోయిక్ లుపెర్ట్ ద్వారా మొదటి గోల్ లభించింది. 11 నిమిషాల వ్యవధిలో అతను మరో గోల్ చేశాడు. రెండో గోల్ వచ్చిన రెండు నిమిషాల్లో టామ్ బూన్ చేసిన గోల్‌తో బెల్జియం 3-0 ఆధిక్యానికి దూసుకెళ్లింది. ఈ దశలో గోల్స్ కోసం ప్రయత్నించడం కంటే, ప్రత్యర్థి జట్టును నిలువరించడానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకొని, డిఫెన్స్‌లోకి వెళ్లిపోయింది. అదే వ్యూహాన్న కొనసాగించి, మ్యాచ్‌ని 3-0గా పూర్తి చేసింది.

చిత్రం..జొసెప్ రొమెయూ