క్రీడాభూమి

యాషెస్‌లో హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 5: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ రెండో టెస్టు హోరాహోరీగా సాగుతున్నది. ఇంగ్లాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు కట్టడి చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 215 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసిన ఈ జట్టు, మంగళవారం ఈ ఓవర్‌నైట్ స్కోరుకు 84 పరుగులు జోడించి, మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ ఖాగా (20), మిచెల్ మార్ష్ (19), మిచెల్ స్టార్క్ (20) కొద్దిసేపు ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 58 ఓవర్లలో 138 పరుగులకే ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా నిలువరించిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 215 పరుగులు వెనుకబడిన కారణంగా, 354 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం ఏర్పడింది. అసాధ్యం కాకపోయినా, కష్టసాధ్యమైన ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, నాలుగో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో నాలుగు వికెట్లకు 176 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ 16 పరుగులకే ఔటయ్యాడు. మార్క్ స్టోన్‌మన్ 36 పరుగులు చేయగా, కెప్టెన్ జో రూట్ 67 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దావీద్ మలాన్ 29 పరుగులు చేశాడు.
రూట్‌తోపాటు క్రీజ్‌లో నిలిచిన క్రిస్ వోక్స్ (5 నాటౌట్) చివరి రోజైన బుధవారం ఎంత వరకూ ఆస్ట్రేలియాకు అండగా నిలుస్తాడో చూడాలి. మొత్తం మీద చివరి రోజున ఇంగ్లాండ్ 178 పరుగులు సాధించాలి. ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. ఆస్ట్రేలియా కోణంలో చూస్తే, ప్రస్తుత భాగస్వామ్యానికి సాధ్యమైనంత త్వరగా తెరదించి, ఆతర్వాత ఆలౌట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్, ఆస్ట్రేలియా బౌలర్ల మధ్య చివరి రోజు ఆటలో ఎంతటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. ఈ హోరాహోరీ పోరు ఎటువైపైనా మొగ్గు చూపడవచ్చన్నది వాస్తవం.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 149 ఓవర్లలో 8 వికెట్లకు 442 డిక్లేర్డ్ (డేవిడ్ వార్నర్ 47, ఉస్మాన్ ఖాజా 53, స్టీవెన్ స్మిత్ 40, పీటర్ హ్యాండ్స్‌కోమ్ 36, షాన్ మార్ష్ 126, టిమ్ పైన్ 57, జేమ్స్ ఆండర్సన్ 1/74, స్టువర్ట్ బ్రాడ్ 2/72, క్రిస్ వోక్స్ 1/84, క్రెగ్ ఓవర్టన్ 3/105).
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 76.1 ఓవర్లలో 227 ఆలౌట్ (అలస్టర్ కుక్ 37, క్రిస్ వోక్స్ 36, క్రెగ్ ఓవర్టన్ 41, నాథన్ లియాన్ 4/60, మిచెల్ స్టార్క్ 3/49, పాట్ కమిన్స్ 2/47).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 58 ఓవర్లలో 138 ఆలౌట్ (ఉస్మాన్ ఖాజా 20, మిచెల్ స్టార్క్ 20, షాన్ మార్ష్ 19, జేమ్స్ ఆండర్సన్ 7/43, క్రిస్ వోక్స్ 4/36).
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 354): 62 ఓవర్లలో 4 వికెట్లకు 176 (అలస్టర్ కుక్ 16, మార్క్ స్టోన్‌మన్ 35, జో రూట్ 67 నాటౌట్, దావీద్ మలాన్ 29, క్రిస్ వోక్స్ 5 నాటౌట్, మిచెల్ స్టార్క్ 2/65, పాట్ కమిన్స్ 1/29, నాథన్ లియాన్ 1/37).