క్రీడాభూమి

వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: న్యూఢిల్లీలో సాధారణ స్థాయికి మించి ఉన్న వాయు కాలుష్యంతో శ్రీలంక క్రికెటర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చివరిదైన మూడో టెస్టులో మొదటి రోజే తమకు ఆడడం కష్టమవుతున్నదని, ఊపిరి కూడా సరిగ్గా అందడం లేదని పదేపదే ఫీల్డ్ అంపైర్లు నిగెల్ లాంగ్, జోల్ విల్సన్‌కు ఫిర్యాదు చేశారు. లంక కెప్టెన్ దినేష్ చండీమల్, ఇతర సభ్యులు ఆటకు మూడు పర్యాయాలు ఆటంకం కలిగించడంతో ఆగ్రహించిన విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌ను అర్ధాంతరంగా డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. రెండు, మూడు రోజుల్లోనూ వాయు కాలుష్యం తమను వేధిస్తున్నదంటూ లంక క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. మాస్క్‌లు ధరించి మైదానంలోకి దిగారు. మూడో రోజు ఆటలో చండీమల్ వైద్య సాయం కోరితే, నాలుగో రోజైన మంగళవారం సురంగ లక్మల్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు, ఐదో ఓవర్ ముగిసిన తర్వాత లంక క్రికెటర్లంతా కాలుష్యం కారణంగా ఆటపై దృష్టి కేంద్రీకరించలేకపోయారు. లక్మల్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. అతను పిచ్‌పైనే వాంతి చేసుకోవడంతో, సహాయక బృందం వెంటనే వచ్చి, ఆతనిని తీసుకెళ్లారు. లక్మల్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా దసున్ షణక మైదానంలోకి దిగాడు. మొత్తం మీద ఢిల్లీలో వాయు కాలుష్యంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నట్టు శ్రీలంక క్రికెటర్లు పేర్కొవడం కొనసాగుతునే ఉంది. నాలుగో రోజు ఆటలో లక్మల్ వాంతి చేసుకోవడం లంక క్రికెటర్ల పరిస్థితికి అద్దం పడుతున్నదని ఆ జట్టు కోచ్ నిక్ పొథాస్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వాంతి వస్తున్నట్టు తీవ్రమైన అసౌకర్యం నడుమ తమ జట్టులోని ఆటగాళ్లు మైదానంలోకి వెళుతున్నారని అతను రెండు రోజుల క్రితమే పేర్కొన్నాడు. పొథాస్ హెచ్చరించినట్టే లక్మల్ వాంతి చేసుకోవడం ఇటు బీసీసీఐ, అటు శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది.

చిత్రం..మైదానంలోనే వాంతి చేసుకున్న సురంగ లక్మల్‌ను బయటకు తీసుకెళుతున్న సహాయక సిబ్బంది