క్రీడాభూమి

‘ఏ’ గ్రేడ్ క్రికెటర్లకు జీతం రూ. 12 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 5: భారత క్రికెటర్ల జీతాన్ని భారీగా పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించినట్టు సమాచారం. బోర్డు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఒక పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం ‘ఏ’ గ్రేడ్ క్రికెటర్లకు జీతం ఏడాదికి రెండు కోట్ల నుంచి 12 కోట్లకు పెరగనుంది. ప్రస్తుత కాంట్రాక్టులో టీమిండియా కెప్టెన్ సహా మొత్తం ఏడుగురు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, ‘బీ’ గ్రేడ్ కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్ల ఇకపై ఏడాదికి 8 కోట్ల రూపాయలు లభిస్తాయి. ప్రస్తుతం వారికి కోటి రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా ‘సీ’ గ్రేడ్ క్రికెటర్ల జీతం 50 లక్షల నుంచి 4 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఏడాదికి సుమారు 12 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని, కాబట్టి వారితో సమానంగా భారత క్రికెటర్లకు కూడా ఇవ్వాలని బీసీసీఐ తీర్మానించిందని సమాచారం. ఈ జీతం కాకుండా క్రికెటర్లు టెస్టుకు 15 లక్షలు, వనే్డ మ్యాచ్‌కి 6 ఆరు లక్షలు, టి-20 మ్యాచ్‌కి 3 లక్షల రూపాయలు చొప్పున అదనంగా సంపాదించుకుంటారు. కెప్టెన్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కోచ్ రవి శాస్ర్తీ ఇటీవలే బీసీసీఐ పాలనాధికారుల బృందం (సీఓఏ)ను కలిసి క్రికెటర్ల జీతాలు పెంచాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. అందుకు సీఓఏ సానుకూలంగా స్పందించినట్టు అప్పుడే సమచారం వచ్చింది. బీసీసీఐ పాలక మండలి కొత్త జీతాలపై నిర్ణయం తీసుకుందని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తున్నది.
ప్రస్తుత కాంట్రాక్టులు
గ్రేడ్ ‘ఏ’ (ఏడాదికి 2 కోట్ల రూపాయలు): విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, మురళీ విజయ్.
గ్రేడ్ ‘బీ’ (ఏడాదికి కోటి రూపాయలు): రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, జస్‌ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్.
గ్రేడ్ ‘సీ’ (ఏడాదికి 50 లక్షల రూపాయలు): శిఖర్ ధావన్, అంబటి రాయుడు, అమిత్ మిశ్రా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్య, ఆశిష్ నెహ్రా, కేదార్ జాదవ్, యుజువేంద్ర చాహల్, పార్థీవ్ పటేల్, జయంత్ యాదవ్, మన్దీప్ సింగ్, ధవళ్ కులకర్ణి, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్.