క్రీడాభూమి

వంద మంది బోల్ట్‌లను తయారు చేయగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అందరూ సమష్టిగా కృషి చేస్తే, మన దేశం మంద మంది బోల్ట్‌లను సృష్టించగలుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిభావంతులకు దేశంలో కొదువ లేదని అన్నారు. సరైన సమయంలో వారిని గుర్తించి, ఉత్తమ శిక్షణను ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలకు కేంద్రం ఇతోథిక ప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించేందుకు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులను ఎంపిక చేసుకొని, ఎవరు, ఏ క్రీడలో రాణిస్తారో గుర్తించి, అందుకు తగినట్టు శిక్షణనిస్తే, ప్రపంచ మేటి క్రీడాకారులను అందించగలుగుతామని చెప్పారు. వచ్చే ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగే టాలెంట్ హంట్ ద్వారా పాఠశాల స్థాయిలో సమర్థులను గుర్తించి, శిక్షణనిప్పిస్తామని తెలిపారు. ‘కేవలం 12 ఏళ్ల వయసులోనే 5 అడుగులా 11 అంగుళాల పొడవు ఉంటే.. అలాంటి వారు వాలీబాల్ లేదా బాస్కెట్‌బాల్‌లో రాణిస్తారు. వౌలిక సదుపాయాలు లేకపోయినా, క్రీడా నిబంధనలు తెలియకపోయినా, వేగంగా పరిగెత్తే సామర్థ్యం ఉన్న వారిని 100 మీటర్ల పరుగులో పోటీకి దింపాలి. 125 కోట్ల జనాభా ఉన్న దేశం నుంచి, మనమంతా ఏకాగ్రతతో ప్రయత్నిస్తే వందలాది మంది బోల్ట్‌లు వస్తారు’ 2004 ఒలింపిక్స్ షూటింగ్‌లో రజత పతకాన్ని సాధించిన రాథోడ్ అన్నారు. పాఠశాల స్థాయి పోటీలను తిలకించేందుకు భారీగానే ప్రజలు వస్తారని, జాతీయ స్థాయి ఈవెంట్స్‌కు ప్రేక్షకులే ఉండరని వ్యాఖ్యానించారు. కింది స్థాయి నుంచి ప్రతి క్రీడా పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేయించడానికి కృషి చేస్తున్నామని రాథోడ్ తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ ఉమ్మడి భాగస్వామ్యంతో క్రీడాభివృద్ధి మరింత చురుగ్గా సాగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉందని, కార్పొరేట్ రంగం తన వంతు చేయూతనిచ్చి, సరైన దిశగా చర్యలు తీసుకుంటే, ఉత్తమ క్రీడాకారులను అందించగలుగుతామని అన్నారు. క్రీడల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్టు రాథోడ్ వివరించారు. దాని ద్వారా దగ్గరలో ఉన్న క్రీడా మైదానం, సంఘం, అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు వంటి పలు వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ వంటి కొన్ని క్రీడలకు ఇలాంటి సౌకర్యం ఉందని, దీనిని అన్ని క్రీడలకూ విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.