క్రీడాభూమి

నాపై కక్ష కట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 7: తనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు కక్ష కట్టారని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐదు సంవత్సరాల సుస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న ఓపెనర్ షర్జీల్ ఖాన్ ఆరోపించాడు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, బుకీలతో తనకు సంబంధాలు లేవని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. భగవంతుడిపై ఒట్టేసి తాను నిజం చెప్తున్నానని, కానీ, పీసీబీ అధికారులు కొందరు తనను అనుసరంగా వేధిస్తున్నారని వాపోయాడు. షర్జీల్‌పై పీసీబీ అవినీతి నిరోధక విభాగం తొలుత రెండేళ్ల సస్పెన్షన్‌ను విధించింది. అయితే, తను చేసిన నేరం చాలా పెద్దదని, రెండేళ్ల శిక్ష చాలా తక్కువని పీసీబీ వాదించింది. అంతేగాక, మధ్యవర్తిత్వ కమిటీకి ముందు కూడా షర్జీల్‌ను నేరస్థుడిగానే పేర్కొంది. వాదనలు, విచారణలు ముగిసిన తర్వాత రెండేళ్ల శిక్షను అవినీతి నిరోధక విభాగం ఐదేళ్లకు పెంచింది. కాగా, ఈ మార్పుపై షర్జీల్ మండిపడ్డాడు. తాను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నానని అన్నాడు. ఈ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశాడు.