క్రీడాభూమి

ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌లో కోహ్లీ సెకండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 7: శ్రీలంకతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. లంకతో జరిగిన మూడు టెస్టుల్లో అతను పలు రికార్డులను బద్దలు చేస్తూ, 610 పరుగులు సాధించాడు. ఫలితంగా మూడు స్థానాలను మెరుగుపరచుకొని, టెస్టు బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొత్తం 938 పాయింట్లతో నంబర్ వన్‌గా కొనసాగుతుండగా, కోహ్లీ ఖాతాలో 893 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 879 పాయింట్లు సంపాదించి, మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, భారత ఆటగాడు చటేశ్వర్ పుజారా (873 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. కోహ్లీ, పుజారా తప్ప టెస్టు బ్యాటింగ్ విభాగం ‘టాప్-10’ భారత ఆటగాళ్లు లేరు. ‘టాప్-20’ని తీసుకుంటే, లోకేష్ రాహుల్ (728 పాయింట్లు) 11, అజింక్య రహానే (662 పాయింట్లు) 18 స్థానాల్లో ఉన్నారు.
టెస్టు బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు మూడో స్థానం దక్కింది. అతను 870 పాయింట్లు సంపాదించగా, 894 పాయింట్లతో జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్), 876 పాయింట్లతో కాగిసో రబదా (దక్షిణాఫ్రికా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 829 పాయింట్లు సంపాదించిన అశ్విన్‌కు నాలుగో స్థానం దక్కింది. ‘టాప్-20’లో వీరితోపాటు మహమ్మద్ షమీ కూడా ఉన్నాడు. అతను 630 పాయింట్లతో 19వ స్థానంలో నిలిచాడు.
ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ 437 పాయింట్లతో నంబర్ వన్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకోగా, రవీంద్ర జడేజా 414 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ స్టార్ బెన్ స్టోక్స్ (880 పాయింట్లు) మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘టాప్-10’లో రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నాడు. అతను 368 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
టీం ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. 124 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 111 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మ యాషెస్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, ఇంగ్లాండ్ 105 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

చిత్రం..విరాట్ కోహ్లీ