క్రీడాభూమి

ఆశలు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల: మహిళల ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు సెమీఫైనల్స్‌కు చేరే అవకాశాలు అడుగంటి పోయాయి. గ్రూప్-బిలో మంగళవారం ధర్మశాలలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలవడంతో ఈ పరిస్థితి దాపురించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ వెల్లస్వామి వనిత (0) పరుగుల ఖాతా ఆరంభించకుండానే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరగా, మరో ఓపెనర్ స్మృతీ మందన 12 పరుగులు సాధించి నిష్క్రమించింది. దీంతో భారత జట్టు 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో కెప్టెన్ మిథాలీ రాజ్ కొద్దిసేపు స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నాలు ఎంతోసేపు కొనసాగలేదు. శిఖా పాండే (12)తో కలసి మూడో వికెట్‌కు 29 పరుగులు జోడించిన మిథాలీ రాజ్ (20) 13వ ఓవర్ ఆరంభంలో వెనుదిరగ్గా, వేదా కృష్ణమూర్తి (2), ఝులన్ గోస్వామి (2) కూడా స్వల్పస్కోర్లకే నిష్క్రమించారు. అయితే మిడిలార్డర్ క్రీడాకారిణి హర్మన్‌ప్రీత్ కౌర్ (25 బంతుల్లో 26 పరుగులు), టెయిలెండర్ అనూజా పాటిల్ (13 బంతుల్లో 13 పరుగులు) కాస్త ఫర్వాలేదనిపించడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 90 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో హీథర్ నైట్ 3 వికెట్లు కైవసం చేసుకోగా, అన్యా షబ్స్రోల్ 2 వికెట్లు, నటాలీ స్కివెర్ ఒక వికెట్ అందుకున్నారు.
అనంతరం 92 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కూడా ఆరంభంలోనే కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ వికెట్‌ను కోల్పోయినప్పటికీ మరో ఓపెనర్ టామీ బెమాంట్ (20)తో పాటు వికెట్ కీపర్ సరా టేలర్ (16), మిడిలార్డర్ క్రీడాకారిణి నటాలీ స్కివెర్ (19) రాణించారు. అనంతరం హీథర్ నైట్ (8)తో పాటు లిదియా గ్రీన్‌వే (0), డానియెల్లీ వ్యాట్ (5), జెన్నీ గన్ (7) త్వరత్వరగా నిష్క్రమించినప్పటికీ క్యాథరీన్ బ్రంట్ (4), అన్యా స్క్రబ్సోల్ (5) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 19 ఓవర్లలో 8 వికెట్ల నషానికి 92 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. లీగ్ దశలో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టుకు ఇది రెండో ఓటమి. ఇక లీగ్ దశలో వెస్టిండీస్‌తో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉన్న భారత జట్టు ఆ మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంతో పాటు ఇతర జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల ఫలితాలు, వాటి గణాంకాలు కూడా అనుకూలంగా ఉంటే తప్ప సెమీస్‌కు చేరే అవకాశాలు లేవు.