క్రీడాభూమి

హామిల్టన్ మ్యాచ్ నుంచి హోల్డర్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, డిసెంబర్ 7: నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయని కారణంగా వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. శనివారం హామిల్టన్‌లో మొదలయ్యే రెండో టెస్టులో ఆడే అవకాశాన్ని అతను కోల్పోయాడు. వెల్టింగ్టన్‌లో జరిగిన మొదటి టెస్టులో వెస్టిండీస్ నిర్ణీత కోటా కంటే మూడు ఓవర్లు తక్కువ బౌల్ చేసింది. గత పనె్నండు నెలల కాలంలో హోల్డన్ కెప్టెన్సీని వెస్టిండీస్ ఈ విధంగా స్లో ఓవర్‌రేట్‌ను నమోదు చేయడం ఇది రెండోసారి. దీనితో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం హోల్డర్‌ను హామిల్టన్ టెస్టు నుంచి సస్పెండ్ చేశారు. అంతేగాక, అతని మ్యాచ్ ఫీజులో 60 శతాన్ని జరిమానాగా విధించారు. జట్టులోని మిగతా సభ్యులు తమతమ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

చిత్రం..జాసన్ హోల్డర్