క్రీడాభూమి

రొనాల్డో సరికొత్త ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, డిసెంబర్ 7: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో రియల్ మాడ్రిక్ ఆటగాడు, పోర్చుగీస్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. బొరషియా డార్ట్‌మండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అతను గోల్ సాధించి, రియల్ మాడ్రిడ్ 3-2 తేడాతో గెలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. అంతేగాక, చాంపియన్స్ లీగ్ ఒక సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ కనీసం ఒక గోల్ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర పుటల్లో చోటు సంపాదించాడు. అదే విధంగా, చాంపియన్స్ లీగ్‌లో మొత్తం 60 గోల్స్ సాధించి, అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా బార్సిలోనా వీరుడు లియోనెల్ మెస్సీ నెలకొల్పిన రికార్డును రొనాల్డో సమం చేశాడు. దీనితో, ఇప్పటికే ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరిన రియల్ మాడ్రిడ్, బార్సిలోనా మధ్య నాటౌట్ పోటీతోపాటు, రొనాల్డో, మెస్సీ మధ్య ఆధిపత్య పోరాటం కూడా కొనసాగనుంది.