క్రీడాభూమి

సెమీస్‌కు అర్జెంటీనా, జర్మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 7: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా, జర్మనీ జట్లు సెమీ ఫైనల్స్ చేరాయి. గురువారం జరిగిన మొదటి మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2 తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించగా, పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లాండ్స్‌ను జర్మనీ ఓడించింది. ఇంగ్లాండ్‌పై ఆదిలోనే ఆధిపత్యాన్ని కనబరచిన అర్జెంటీనాకు 21వ నిమిషంలో లుకాస్ విలా ద్వారి తొలి గోల్ లభించింది. ఎదురుదాడికి దిగిన ఇంగ్లాండ్‌కు మరో ఎనిమిది నిమిషాల్లోనే డేవిడ్ కాండన్ ఈక్వెలైజర్‌ను అందించాడు. కొన్ని క్షణాల వ్యవధిలోనే మథియాస్ పరెడెస్ గోల్ చేయడంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. 34వ నిమిషంలో జువాన్ గిలార్డ్ గోల్ చేయడంతో ఈ ఆధిక్యాన్ని 3-1గా మార్చుకున్న అర్జెంటీనా ఆతర్వాత రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. మ్యాచ్ చివరి క్షణాల్లో ఇంగ్లాండ్‌కు ఆడం డిక్సన్ కంటితుడుపు విజయాన్ని అందించాడు. ఇలావుంటే, జర్మనీ, నెదర్లాండ్స్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ చివరికి పెనాల్టీ షూటౌట్‌తో ముగిసింది. నిర్ణీత సమయం ముగిసే వరకూ ఇరు జట్లు చెరి మూడు గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఫలితం తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యంకాగా, జర్మనీ నాలుగు గోల్స్ చేసి సెమీస్‌లోకి అడుగుపెట్టగా, 3 గోల్స్ చేసిన నెదర్లాండ్స్ నిష్క్రమించింది.
భారత్ సెమీస్ నేడు
పటిష్టమైన బెల్జియంను క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడించి సెమీ ఫైనల్ చేరుకున్న భారత జట్టు శుక్రవారం నాటి మ్యాచ్‌లో అర్జెంటీనాను ఢీ కొంటుంది. నిలకడ లేకపోవడం భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా పేర్కోవాలి. నిరుటి విజేత, ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌ని డ్రా చేసుకున్న భారత్ ఆతర్వాత అదే స్థాయిలో రాణించలేకపోయింది. అయితే, క్వార్టర్ ఫైనల్స్‌లో ఎదురుదాడికి దిగి, అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. బెల్జియంను మట్టికరిపించి, సెమీస్ చేరింది. ఫైనల్‌లో స్థానం కోసం అర్జెంటీనాతో ఏ విధంగా ఆడుతుందో చూడాలి.