క్రీడాభూమి

మూడు డిజైన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, డిసెంబర్ 7: టోక్యో ఒలింపిక్స్ మస్కట్ ఎంపిక కసరత్తును జపాన్ ముమ్మరం చేసింది. 2020లో జరిగే ఈ ఒలింపిక్స్‌కు కార్టూన్ క్యారెక్టర్ నుంచి కడ్లీ రాకూన్స్ వరకూ ఎన్నో క్యారికేచర్స్‌ను పరిశీలించిన ఒలింపిక్ నిర్వాహణ కమిటీ (ఓసీ) చివరికి మూడు మస్కట్స్‌ను గుర్తించింది. వీటిలో ఒకదానికి ఆమోద ముద్ర పడుతుంది. ఈనెల 11 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకూ జపాన్‌లోని అన్ని పాఠశాలు, విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల నుంచి ఓసీ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. ఓటింగ్ నిర్వహిస్తుంది. అదే సమయంలో ఇలాంటి నమూనా గతంలో ఎక్కడైనా, ఎవరైనా వాడారో లేదో అన్న విషయంపై స్పష్టత తీసుకుంటుంది. అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకున్న తర్వాత, సీఓ అధికారులు ఫిబ్రవరి 28న ఖరారైన మస్కట్‌ను అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి రేసులో ఉన్న మూడు మస్కట్స్‌లో ‘యురూ క్యారా’కు ఎక్కువ మద్దతు ఉంటుందని అంచనా. అదే విధంగా ‘మగటామా’ కూడా మస్కట్‌గా ఎక్కువ మందిని ఆకర్షించవచ్చని అంటున్నారు. బుధవారం విడుదల చేసిన ఈ మూడు మస్కట్స్ నుంచి దేనికి అధికారికంగా గుర్తింపు లభిస్తుందనేది చూడాలి.