క్రీడాభూమి

నేరము.. శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 8: అమెరికా జిమ్నాస్టిక్స్ మాజీ డాక్టర్ లారీ నాసర్ చేసిన నేరం రుజువైం ది. అమెరికా కోర్టు అతనికి 60 సంవత్సరాల జై లు శిక్షను విధించింది. 54 ఏళ్ల నాసర్ అమెరికా జాతీయ జిమ్నాస్టిక్స్ విభాగంలో వైద్యుడిగా సే వలు అందిస్తున్న సమయంలో సుమారు 100 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. వారి ని బెదిరించి, భయపెట్టి లోబరుచుకున్నాడు. అం తేగాక, బాలికలతో నీలి చిత్రాలను కూడా తీశా డు. వాటిని బయటపెడతానని బెదిరించి, వారిని శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురి చేశాడు. అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి ముందు ప్రాసిక్యూ షన్ అధికారులు ఏకంగా 37,000 గ్రాఫిక్ వీడి యోలను, ఫొటోలను సమర్పించారంటే, నాసర్ ఏ స్థాయలో అమ్మాయలను వేధించాడో స్పష్టమ వుతుంది. మిచగాన్ కోర్టులో న్యాయమూర్తి జానె ట్ నెఫ్ ఈ సాక్ష్యాధారలను పరిశీలించి, దిగ్భ్రాం తిని వ్యక్తం చేసింది. ఒక్కో విభాగంలో గరిష్టం గా విధించే 20 సంవత్సరాల జైలు శిక్షను అతనికి మూడు వేర్వేరు కేఋల్లో ఒకేసారి విధిస్తున్నట్టు తీర్పు చెప్పింది. ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ, ఎ వరికీ అనుమానం రాకుండా నేరాలు చేసే ఇలాం టి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొం ది. నాసర్ తనను తాను సర్వశక్తి సంపన్నుడిగా అ భిప్రాయపడుతున్నాడని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జూలై మాసంలో ప్రాసిక్యూషన్ ముందు నాసర్ తన నేరాన్ని అంగీకరించడంతో, కేసు పరి ష్కారం సులభతరమైంది. దీనికితోడు అతను తీ సిన నీలి చిత్రాలు, ఫొటోలు బహిర్గతమయ్యా య. ఎంతో మంది బాలికలను అతని అకృత్యాల ను కోర్టుకు వివరించారు. వారిలో చాలా మంది ప్రస్తుతం అంతర్జాతీయ కెరీర్‌ను ముగించుకొని స్థిర పడినప్పటికీ, నాసర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి అతనికి సాధారణ శిక్ష సరిపోదని అభిప్రాయప డింది. ఇంత మంది అమ్మాయలను లైంగికంగా వేధించిన అతనికి 60 ఏళ్ల జైలు కూడా చాలా చిన్నదేనని వ్యాఖ్యానించింది. కాగా, కోర్టులోనే ఉన్న నాసర్ ఈ తీర్పును ఆసాంతం విన్నారు. ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అతను వౌనా న్ని పాంటించాడు.

చిత్రం..లారీ నాసర్