క్రీడాభూమి

షార్ట్‌పిచ్ బంతులపై విండీస్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, డిసెంబర్ 8: న్యూజిలాండ్‌తో శనివారం నుంచి మొదలుకానున్న చివరి, రెండో టెస్టు కోసం వెస్టిండీస్ అన్ని విధాలా సిద్ధమవుతున్నది. మొదటి టెస్టును ఇన్నింగ్స్ 67 పరుగుల తేడాతో ఓడిపోయిన వెస్టిండీస్‌కు రెండో టెస్టు అత్యంత కీలకంగా మారింది. ఈ టెస్టును గెలిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉన్న కారణంగా, మొదటి టెస్టులో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నది. అందులో భాగంగానే, శుక్రవారం నాటి నెట్స్‌లో షార్ట్ పిచ్ బంతులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అదే విధంగా డైవింగ్‌ను కూడా విండీస్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. షార్ట్‌పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కోలేక, ఎక్కువ మంది సులభంగానే న్యూజిలాండ్ పేసర్లకు దొరకడంతో, ఆ సమస్యకు చెక్ పెట్టే ఉద్దేశంతో నెట్స్‌లో అలాంటి బంతులకే ప్రాధాన్యం ఇచ్చింది. అంతేగాక, ఫీల్డింగ్‌ను మరింత మెరుచు పరచాలన్న ఉద్దేశంతో, డైవింగ్‌ను కూడా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు.
ఇలావుంటే, స్లో ఓవర్‌రేట్ కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్ ఎదుర్కొంటున్న రెగ్యులర్ కెప్టెన్ జాసన్ హోల్డర్ హామిల్టన్ టెస్టులో ఆడలేకపోవడం విండీస్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య. అతను లేకపోవడంతో, విండీస్ బౌలిం గ్ విభాగం బలహీనపడే ప్రమాదం కనిపిస్తున్నది.