క్రీడాభూమి

రియోతో సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్: జమైకా ‘చిరుత’గా పేరు పొందిన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ త్వరలో తన ఒలింపిక్ కెరీర్‌కు స్వస్థి పలకనున్నాడు. ఈ ఏడాది బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో జరుగనున్న ఒలింపిక్ క్రీడలే తన కెరీర్‌లో చివరి ఒలింపిక్ క్రీడలని అతను స్పష్టం చేశాడు. తద్వారా 2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడల వరకు తన కెరీర్‌ను పొడిగించే అవకాశం లేదని అతను తేల్చిచెప్పాడు. ఇప్పట్లో బోల్ట్ ఫిట్నెస్‌కు ఎటువంటి ఢోకా ఉండదని, టోక్యో ఒలింపిక్ క్రీడల వరకు అతను పూర్తి ఫిట్నెస్‌తో కొనసాగే అవకాశం ఉందని కొద్ది నెలల క్రితం అతని కోచ్ గ్లెన్ మిల్ స్పష్టం చేశాడు. దీంతో తన కెరీర్‌ను మరికొంత కాలం పొడిగించాలనుకుంటున్నట్లు జనవరిలో చెప్పిన బోల్ట్ ప్రస్తుతం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఎఎఫ్‌పి అనుబంధ వార్తా సంస్థ ఎస్‌ఐడికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రియో ఓలింపిక్ క్రీడల్లో కనీసం మూడు పసిడి పతకాలు సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నానని, అయితే ఈ క్రీడలు ముగిసిన తర్వాత ఒలింపిక్ కెరీర్‌ను ముగిస్తానని అతను చెప్పాడు. ‘కచ్చితంగా రియో ఓలింపిక్ క్రీడలే నా కెరీర్‌లో చివరి ఒలింపిక్స్. ఈ క్రీడలు ముగిసిన తర్వాత నేను మరో నాలుగేళ్ల పాటు పూర్థి ఫిట్నెస్‌తో కొనసాగడం ఎంతో కష్టమైన వ్యవహారమే. ప్రస్తుతం రియో ఒలింపిక్స్‌లో నేను నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకో గలిగితే అదే పదివేలు. కనుక రియోలో జరిగే క్రీడల తర్వాత ఒలింపిక్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నా’ అని బోల్ట్ తెలిపాడు. ఇంతకుముందు 2008, 2012లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో అద్భుత ప్రతిభను కనబర్చి ఆరు పసిడి పతకాలు కైవసం చేసుకున్న బోల్ట్ వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్ ముగిసిన తర్వాత బూట్లు విప్పేయాలనుకుంటున్నట్లు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం విదితమే. అయితే ఈ ఏడాది రియోలో మరో మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని తన ఖాతాలో మొత్తం 9 పసిడి పతకాలను జమ చేసుకోవాలని ఆశిస్తున్నట్లు బోల్ట్ తెలిపాడు. ‘రియో ఒలింపిక్స్‌లో మరో మూడు పసిడి పతకాలు సాధించాలని ఆశిస్తున్నా. ప్రస్తుతం నా ముందున్న అతిపెద్ద లక్ష్యం, స్వప్నం అవే కావండంతో ప్రస్తుతం దీనిపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించా’ అని బోల్ట్ స్పష్టం చేశాడు. అయితే రిటైర్ కావడానికి ముందు మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టి చరిత్ర సృష్టించాలనుకుంటున్నానని, ప్రత్యేకించి 200 మీటర్ల పరుగును 19 సెకన్లలోపే పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా చరిత్రలో నిలవాలని ధృఢంగా నిశ్చయించుకున్నానని అతను స్పష్టం చేశాడు.