క్రీడాభూమి

‘పోటీ’పై ఆందోళన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, డిసెంబర్ 8: జాతీయ జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఎదురయ్యే పోటీ గురించి తాను ఆందోళన చెందడం లేదని, నిజానికి ఆ విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించనని భారత పేసర్ సిద్ధార్థ్ కౌల్ స్పష్టం చేశాడు. లంకతో జరిగే మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో చోటు దక్కించుకున్న 27 ఏళ్ల కౌల్ శుక్రవారం పీటీఐతో మాట్లాడుతూ జాతీయ జట్టుకు ఎంపిక కావడమే తన లక్ష్యమని, అది నెరవేరిందని చెప్పాడు. దేశవాళీ పోటీల్లో రాణించానని, అదే ఆత్మవిశ్వాసంతో వనే్డ సిరీస్‌కు సిద్ధమయ్యానని తెలిపాడు. టీమిండియాలోని ఇతర సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్నానని చెప్పాడు. ఐపీఎల్‌లో, భారత్ ‘ఏ’లో ఆడానని, ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికయ్యానని అంటూ, ఈ స్థాయికి వచ్చేందుకు ఎంతో కృషి చేశానని అన్నాడు.