క్రీడాభూమి

వాయు కాలుష్యంపై ఐసీసీ చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, డిసెంబర్ 8: న్యూఢిల్లీలో ఇటీవల భారత్‌తో జరిగిన మూడవ, చివరి టెస్టు మ్యాచ్ సమయంలో శ్రీలంక ఆటగాళ్లు వాయు కాలుష్యం కారణంగా అల్లాడిన విషయం ఇక్కడ జరిగిన రెండు రోజుల వర్క్‌షాప్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్చించినట్టు సమాచారం. 2019-2023 కాలానికి ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ) విధివిధానాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే, ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలపైన కూడా చర్చించినట్టు ఐసీసీ పాలక వర్గం సభ్యుడొకరు పీటీఐతో మాట్లాడుతూ చెప్పాడు. అందులో భాగంగానే న్యూఢిల్లీలో ప్రమాదకరమైన స్థాయిలో నెలకొన్న వాయు కాలుష్యం కూడా ప్రస్తావనకు వచ్చిందని ఆ అధికారి తెలిపాడు. ఎఫ్‌టీపీని ఖరారు చేసే ముందు, ఇలాంటి విపరీత పరిస్థితులను సైతం దృష్టిలో ఉంచుకోవాలని సభ్య దేశాలకు ఐసీసీ పాలక వర్గం సూచించినట్టు పేర్కొన్నాడు. న్యూఢిల్లీలో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు, శ్రీలంక క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేకపోతున్నామని, వాంతి వచ్చే పరిస్థితుల్లో ఆటపై దృష్టి కేంద్రీకరించడం అసాధ్యమని వారు పలుసార్లు ఫీల్డ్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లారు. రెండో రోజు ఆటలో లంక క్రికెటర్లు పదేపదే ఆటకు అంతరాయం కల్పించడంతో ఆగ్రహించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. కాగా, శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ చాలాసార్లు వైద్య సాయాన్ని కోరాడు. బౌలర్ సురంగ లక్మల్ మైదానంలోనే వాంతులు చేసుకోవడంతో, అతనిని ఫిజయోథెరపిస్టు, ఇతర సహాయక బృందం బయటకు తీసుకెల్సి వచ్చింది. శ్రీలంక ఆటగాళ్లలో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లాను మినహాయిస్తే, మిగతా వారంతా ముఖాలకు మాస్క్‌లు వేసుకొని మైదానంలోకి దిగిన వారే. కాలుష్యం అంత తీవ్రంగా ఏమీ లేదని మొదట వాదించిన భారత పేసర్ మహమ్మద్ షమీ నాలుగు రోజు మైదానంలో వాంతి చేసుకున్నాడు. అంతకు ముందే ఢిల్లీలో కాలుష్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడంపై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ, భవిష్యత్తులో ఇలాంటి నగరాలకు ఎఫ్‌టీపీలో చోటు కల్పించవద్దని సభ్య దేశాలను కోరినట్టు సమాచారం. ఆటగాళ్ల భద్రత, వారి ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. అయితే, ఈ సమావేశం తీర్మానాలను ఐసీసీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.