క్రీడాభూమి

సూపర్ స్టార్ రొనాల్డోకు బాలన్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, డిసెంబర్ 8: మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పోర్చుగీస్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇక్కడ అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో బాలన్ డిఆర్ ఉత్తమ క్రీడాకారుడు అవార్డును స్వీకరించాడు. అతనికి ఈ అవార్డు దక్కడం ఇది ఐదోసారి. అత్యధిక పర్యాయాలు బాలన్ అవార్డును పొందిన అర్జెంటీనా హీరో లియోనెల్ మెస్సీతో కలిసి ఇప్పుడు రొనాల్డో రికార్డును పంచుకుంటున్నాడు. ఈసారి ఓటింగ్‌లో మెస్సీకి రెండో స్థానం దక్కగా, ఇటీవలే బార్సిలోనా నుంచి పారిస్ జెయింట్ జర్మెయిన్ (పీఎస్‌జీ)కి వలస వెళ్లిన బ్రెజిల్ ఆటగాడు నేమార్ మూడో స్థానంలో నిలిచాడు. ఇలావుంటే, చాంపియన్స్ లీగ్ గత సీజన్‌లో 32 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో జువెంటాస్‌ను ఓడించి రియల్ మాడ్రిడ్ చాంపియన్‌గా నిలవడంలో రొనాల్డో కీలక భూమిక పోషించాడు. అదే విధంగా ఐదేళ్ల తర్వాత స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో ఐదేళ్ల తర్వాత రియల్ మాడ్రిడ్‌ను విజేతగా నిలిపాడు. బాలన్ అవార్డును స్వీకరించిన తర్వాత రొనాల్డో మాట్లాడుతూ, రికార్డు స్థాయిలో ఐదోసారి ఈ ట్రోఫీని దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. ఈ అవార్డు ఉత్సవాన్ని చూసేందుకు పోర్చుగల్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన తన తల్లి మరియా డొలొరెస్‌ను వేదికపైకి ఆహ్వానించి, ఆమెకు ట్రోఫీనిచ్చి కేరింతలు కొట్టాడు. కుమారుడు రొనాల్డో జూనియర్‌తో కలిసి చాలా సేపు అభిమానులకు అభివాదం చేస్తూ గడిపాడు. ఇప్పటికే నలుగురు పిల్లలకు తండ్రయిన అతను కనీసం ఏడుగురు పిల్లలు ఉంటే బాగుంటుందని అన్నప్పుడు ఆ ప్రాంతమంతా నవ్వులమయమైంది. తనకు జీవితాన్నిచ్చిన సాకర్‌కు ఎప్పుడూ రుణపడే ఉంటానని రొనాల్డో వ్యాఖ్యానించాడు.