క్రీడాభూమి

భారత్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 8: ఇక్కడ జరుగుతున్న హాకీ వరల్డ్ ఫైనల్ టోర్నమెంట్‌లో భారత్ పోరు సెమీ ఫైనల్స్‌లో ముగిసింది. శుక్రవారం జరిగిన పోరులో అర్జెంటీనా చేతిలో 0-1 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. మొదటి నుంచి ఎంతో జాగ్రత్తగా ఆడిన అర్జెంటీనా, అటు డిఫెన్స్‌లోనూ, ఇటు అఫెన్స్‌లోనూ సమాన ప్రతిభ కనబరచింది. ఆరంభంలో కొంత మందగొడిగా సాగినప్పటికీ, క్రమంగా ఆట వేగాన్ని పుంజుకుంది. 27వ నిమిషంలో గంజాలెజ్ పీలట్ గోల్ చేయడంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆతర్వాత మళ్లీ రక్షణాత్మక విధానానే్న అనుసరించడంతో, భారత్‌కు గోల్స్ చేయడం సాధ్యం కాలేదు. దీనికితోడు చేతికి అందిన అవకాశాలను ఒత్తిడికి లోనైన కారణంగా చేతజార్చుకున్న భారత్ మూల్యాన్ని చెల్లించుకుంది. స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో ఫైనల్ చేరడంలో విఫలమైంది.
శనివారం జరిగే రెండో సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, పటిష్టమైన జర్మనీ జట్లు తలపడతాయి.
నెదర్లాండ్స్‌కు ఏడో స్థానం
ఇంగ్లాండ్‌తో ఏడో స్థానం కోసం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ విజయం సాధించింది. మిర్కో ప్రూసెర్ 42వ నిమిషాలో కీలక గోల్ చేసి, నెదర్లాండ్స్‌కు 1-0 తేడాతో విజయాన్ని అందించాడు. ఆరంభం నుంచి చివరి వరకూ ఇరు జట్లూ మితిమీరిన డిఫెన్స్‌తో అభిమానుల సహనానికి పరీక్ష పెట్టాయి. ప్రథామార్ధంతోపాటు ద్వితీయార్ధంలోనూ చాలాసేపు ఇదే రీతిలో గడిచిపోయింది. ప్రూసెర్ గోల్ చేయకపోతే, ఈ మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూటౌట్ ద్వారా నిర్ధారించాల్సి వచ్చేది. కాగా, ఐదు, ఆరు స్థానాల కోసం శనివారం బెల్జియం, స్పెయిన్ జట్లు ఢీ కొంటాయి.

చిత్రం..భారత్‌పై అర్జెంటీనాను గెలిపించిన పీలట్