క్రీడాభూమి

ఆత్మవిశ్వాసంతో బరిలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, డిసెంబర్ 9: విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతోనే టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధంగా ఉన్నామని శ్రీలంక చీఫ్ కోచ్ నిక్ పొథాస్ స్పష్టం చేశాడు. శ్రీలంక క్రికెటర్లు శనివారం నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. వారి ప్రాక్టీస్ తీరును నిశితంగా గమనిస్తూ, అవసరమైన సూచనలు చేస్తూ ఎక్కువ సమయం మైదానంలో గడిపిన పోథాస్ ఆతర్వాత విలేఖరులతో మాట్లాడుతూ టీమిండియా చేతిలో టెస్టు సిరీస్‌లో ఎదురైన ఓటమి గురించి ఆలోచించడం లేదని అన్నాడు. అంతకు ముందు స్వదేశంలో తాము వనే్డ సిరీస్‌లో ఓడిన విషయాన్ని కూడా తలచుకోవడం లేదని చెప్పాడు. ఇంతకు ముందు జరిగిన పొరపాట్లను, ఎదుర్కొన్న వైఫల్యాలను విశే్లషించుకొని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని తెలిపాడు. తమ వనే్డ జట్టు చాలా వరకూ లోపాలను సవరించుకుందని, అందుకే భారత్‌తో పోరుకు ఏమాత్రం బెదిరిపోవడం లేదని అన్నాడు. టీమిండియా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉందని, దీనికితోడు స్వదేశంలో ఆడుతున్నందువల్ల వారికి హోం అడ్వాంటేజ్ కూడా ఉంటుందని గుర్తుచేశాడు. అంతమాత్రం చేత భారత్‌ను చూసి దడుచుకునే అవసరం లేదని వ్యాఖ్యానించాడు. గతానికి ఏమాత్రం ప్రాధాన్యం లేదని, ప్రతి సిరీస్ ఒక కొత్త పోరాటానికి తెర తీస్తుందని అన్నాడు. మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ హోరాహోరీగా సాగే అవకాశం ఉందన్నాడు. భారత్‌ను ఢీకొనేందుకు అన్ని విధాలా తాము సన్నద్ధమయ్యామని పొథాస్ చెప్పాడు.