క్రీడాభూమి

సరైన సమయం ఇదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, డిసెంబర్ 9: వరుస పరాజయాలతో అల్లాడుతున్న శ్రీలంక మళ్లీ గాడిలో పడేందుకు ఇదే సరైన సమయమన్న వాదన వినిపిస్తున్నది. అసాధారణ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతిని ఇవ్వడం శ్రీలంకకు కలిసొచ్చే అంశం. అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా రాణిస్తున్న అతను జట్టులోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. బ్యాటింగ్‌లోగాక, కెప్టెన్సీలోనూ దూకుడును ప్రదర్శించే కోహ్లీ స్థానంలో జట్టును నడిపించే బాధ్యతలు స్వీకరించిన స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మ అదే స్థాయిలో జట్టును ముందుకు తీసుకెళ్లలేడన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకే, కోహ్లీ లేని టీమిండియాను దెబ్బతీయడం సులభమని తిసర పెరెరా నాయకత్వంలోని శ్రీలంక భావిస్తున్నది. అయితే, నిలకడ లోపించిన శ్రీలంకకు ఇది సాధ్యమా అన్నది అనుమానమే. కెప్టెన్ తిసర పెరెరా జాతీయ జట్టులో స్థానానికే భరోసా లేకపోతే, మిగతా ఆటగాళ్ల పరిస్థితిని ఊహించుకోవచ్చు. వరుసగా 12 వనే్డల్లో పరాజయాలను చవిచూసిన శ్రీలంకను, ఏడు వరుస సిరీస్‌ల్లో గెలిచిన భారత్‌కు సమవుజ్జీగా పేర్కోలేం. వైట్‌వాష్ వేయించుకోకుండా బయటపడితే, ఆ జట్టు సిరీస్‌ను గెల్చకున్నంతగా ఆనందించాలి. ఏంజెలో మాథ్యూస్, దనుష్క గుణతిలక, అసెల గుణరత్నే వంటి మేటి ఆటగాళ్లు ఉండడం శ్రీలంకకు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నది. ఏ రకంగా చూసినా టీమిండియా కంటే చాలా బలహీనంగా కనిపిస్తున్న శ్రీలంక ధర్మశాలలో ఎంత వరకు పోరాడుతుందో చూడాలి. కోహ్లీలేని జట్టును దెబ్బతీయాలన్న తిసర పెరెరా బృందం వ్యూహం ఫలించడం సులభం కాదు.