క్రీడాభూమి

బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తస్కిన్‌కు చుక్కెదురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా తాత్కాలికంగా అంతర్జాతీయ పోటీలకు దూరమైన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్‌కు చుక్కెదురైంది. అతనిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడానికి జ్యుడిషియల్ కమిషనర్ నిరాకరించాడు. టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ధర్మశాలలో నెదర్లాండ్స్‌తో బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడినప్పుడు తస్కిన్ బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని అంపైర్లు ఫిర్యాదు చేశారు. దీనితో ప్రపంచ స్థాయి మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయకుండా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అతనిని నిషేధించింది. బయోమెట్రిక్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించాల్సిందిగా ఐసిసిని కోరకుండానే అతను చెన్నైలోని బయోమెట్రిక్ పరీక్షా కేంద్రంలో వైద్య పరీక్షలకు హాజరయ్యాడు. కాగా తస్కిన్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ఒక్కోసారి చేతి వంపు నిర్ణీత 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంగుతున్నదని చెన్నై కేంద్రం తన నివేదికలో స్పష్టం చేసింది. ఇలావుంటే, తన బౌలింగ్ యాక్షన్ సక్రమంగానే ఉందని, నిషేధాన్ని ఎత్తివేసి టి-20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం కల్పించాలని తస్కిన్ చేసిన విజ్ఞప్తిని జ్యుడిషియల్ కమిషనర్ విచారణకు స్వీకరించాడు. చెన్నై కేంద్రం నివేదిక అందిన వెంటనే, జ్యుడిషియల్ కమిషనర్ తస్కిన్ అభ్యర్థనను కొట్టేశాడు. ఐసిసి విధించిన సస్పెన్షన్ సరైనదేనని ప్రకటించడంతో, అధికారికంగా బయోమెట్రిక్ పరీక్షకు అనుమతించాల్సిందిగా ఐసిసిని కోరడం మినహా తస్కిన్‌కు మరో మార్గం లేదు.

మహిళల టి-20 వరల్డ్ కప్
ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా గెలుపు
చెన్నై, మార్చి 23: మహిళల టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో ఓడించింది. 158 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 89 పరుగులు చేయగలిగింది. సనే లస్ నాలుగు ఓవర్లలో కేవలం ఎనిమిది పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చింది. ఆమె ధాటికి ఐర్లాండ్ బ్యాట్స్‌విమెన్ నిలవలేకపోయారు.
దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని, 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించింది. త్రిష చెట్టి 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, లిజెల్ లీ అజేయంగా 30 పరుగులు సాధించింది. చోల్ ట్రయాస్, డేన్ వాన్ నికెర్క్ చెరి 20 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో కిమ్ గార్త్ 26 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది. సియెరా మెట్‌కాఫ్, ఇసోబెల్ జాయిస్, రాబిన్ లూయిస్ తలా ఒక వికెట్ చొప్పున సాధించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. క్లేర్ షిల్లింగ్‌వర్త్ (34), ఇసోబెల్ జాయిస్ (22) తప్ప ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. సనే లస్ ఐదు వికెట్లు కూల్చి, దక్షిణాఫ్రికాకు కీలక విజయాన్ని అందించింది.