క్రీడాభూమి

అర్జెంటీనాతో ఆసీస్ టైటిల్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 9: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్‌లో అర్జెంటీనాతో టైటిల్ పోరును డిఫెండింగ్ చాంపియన్, విశ్వవిజేత ఆస్ట్రేలియా ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో ఈ జట్టు పటిష్టమైన జర్మనీని 3-0 తేడాతో ఓడించింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు వ్యూహాత్మకంగా డిఫెన్స్‌కు పరిమితమయ్యాయి. ఒకరి అవకాశాలను మరొకరు అడ్డుకుంటూ మ్యాచ్‌ని కొనసాగించడంతో, ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే, ద్వితీయార్ధంలో ఆస్ట్రేలియా తన వ్యూహాన్ని ఒక్కసారిగా మార్చుకుంది. రక్షణ వలయాన్ని అదే విధంగా కొనసాగిస్తూ, దాడులకు ఉపక్రమించింది. 42వ నిమిషంలో డిలాన్ వర్త్‌స్పూన్ ఆసీస్‌కు తొలి గోల్‌ను అందించాడు. మరో ఆరు నిమిషాల్లోనే జెరెనీ హేవార్డ్ ద్వారా ఆ జట్టుకు రెండో గోల్ లభించింది. 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత కొంత సేపు ఆస్ట్రేలియా జోరును తగ్గించింది. అయితే, జర్మనీ ఆటగాళ్లు దూసుకురాకుండా అడ్డుకుంటూ, సమయాన్ని గడిపింది. 60వ నిమిషంలో టామ్ విక్‌హామ్ సాధించిన గోల్‌తో ఆస్ట్రేలియా 3-0 తేడాతో విజయభేరి మోగించింది. మొదటి సెమీ ఫైనల్‌లో భారత్‌ను 1-0 ఆధిక్యంతో ఓడించిన అర్జెంటీనా ఫైనల్‌లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. కాగా, కాంస్య పతకం కోసం ఆదివారం జర్మనీతో భారత్ తలపడుతుంది.