క్రీడాభూమి

టీమిండియాకు తొలి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, డిసెంబర్ 10: కెప్టెన్‌గా మొదటిసారి ఒక వనే్డ సిరీస్‌కు సేవలు అందిస్తున్న రోహిత్ శర్మకు మొదటి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ‘అండర్ డాగ్’గా బరిలోకి దిగిన శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి, టీమిండియాకు షాకిచ్చింది. హేమాహేమీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే పోరాటాన్ని కొనసాగించి, అర్ధ శతకాన్ని నమోదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 50 ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయలేక, 38.2 ఓవర్లలో కేవలం 112 పరుగులకే భారత్ కుప్పకూలగా, శ్రీలంక మూడు వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని ఛేదించి, ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. భారత బ్యాటింగ్‌ను దారుణంగా దెబ్బతీసిన సురంగ లక్మల్ నాలుగు వికెట్లు పడగొట్టి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్వీకరించాడు.
సున్నాకే తొలి వికెట్
టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ పరుగుల ఖాతాను తెరవకుండానే మొదటి వికెట్‌ను కోల్పోయింది. మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ వికెట్లకు అడ్డంగా దొరకిపోయి, ఎల్‌బీగా వెనుదిరిగాడు. రెండు పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. 13 బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసిన అతను సురంగ లక్మల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లాకు చిక్కాడు. దినేష్ కార్తీక్ (0) మనీష్ పాండే (2), శ్రేయాస్ అయ్యర్ (9) కూడా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ 16 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ధోనీ నిలకడగా ఆడుతున్నప్పటికీ, అతనికి మిగతా వారి నుంచి చెప్పుకోదగిన సహకారం లభించలేదు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 10 బంతుల్లో 10 పరుగులు చేసి, నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో ఏంజెలో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ ఐదు బంతులు ఎదుర్కొన్నప్పటికీ, ఒక్క పరుగు కూడా చేయకుండా, సురంగ లక్మల్ బౌలింగ్‌లో డిక్‌విల్లా క్యాచ్ అందుకోగా నిష్క్రమించాడు. భారత్ 29 పరుగులకు ఏడు వికెట్లు చేజార్చుకున్న తరుణంలో, యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కొంత సేపు ధోనీకి మద్దతునిచ్చే ప్రయత్నం చేశాడు. వీరి కాంబినేషన్‌లోనే టీమిండియా స్కోరు 50 పరుగుల మైలురాయిని అధిగమించింది. 70 పరుగుల వద్ద కుల్దీప్ (19) ఔటయ్యాడు. అకిల ధనంజయ బౌలింగ్‌లో షాట్ కొట్టేందుకు క్రీజ్ వెలుపలికి వచ్చిన అతనిని వికెట్‌కీపర్ డిక్‌విల్లా
స్టంప్ చేశాడు. ధోనీ పరుగుల వేటను కొనసాగించడానికి వీలుగా డిఫెన్స్‌కే పరిమితమైన జస్‌ప్రీత్ బుమ్రా 15 బంతులు ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయకుండా సచిత్ పతిరన బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యుజువేంద్ర చాహల్ (0 నాటౌట్) కూడా 9 బంతులు ఎదుర్కొని, ధోనీకి సహకరించే యత్నం చేశాడు. ధోనీ 87 బంతుల్లో, 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేసి తిసర పెరెరా బౌలింగ్‌లో దనుష్క గుణతిలక క్యాచ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్‌కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు ఇంకా 68 బంతులు మిగిలి ఉండగానే తెరపడింది. సురంగ లక్మల్ 10 ఓవర్లు బౌల్ చేసి, కేవలం 13 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. నువాన్ ప్రదీప్ 37 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు.
భారత్‌ను ఓడించి, సిరీస్‌లో బోణీ చేసేందుకు కేవలం 113 పరుగులు చేయాల్సిన శ్రీలంక 7 పరుగుల స్కోరువద్ద దనుష్క గుణతిలక వికెట్ చేజార్చుకుంది. ఒక పరుగు చేసిన అతను జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ ధోనీకి దొరికాడు. 19 పరుగుల వద్ద లాహిరు తిరిమానే కూడా ఔటయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని, పరుగులేవీ చేయకుండానే అతను భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. లంక విజయానికి పునాది వేసిన ఓపెనర్ ఉపుల్ తరంగ 46 బంతుల్లో 49 పరుగులు చేసి, హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివరిలో ఏంజెలో మాథ్యూస్ (42 బంతుల్లో 25 నాటౌట్), నిరోషన్ డిక్‌విల్లా (24 బంతులోవ్ల 26 నాటౌట్) మరో వికెట్ కూలకుండా శ్రీలంకకు విజయాన్ని అందించారు. 20.4 ఓవర్లలో లంక విజయభేరి మోగించింది. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య తలా ఒక్కో వికెట్ కూల్చారు.

పూర్తిగా పది ఓవర్ల కోటాను పూర్తి చేసి, కేవలం 13 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, భారత ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న శ్రీలంక బౌలర్ సురంగ లక్మల్. అతని బౌలింగ్‌లో రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్ ఔటయ్యారు

వనే్డల్లో భారత్‌కు 112 పరుగులు మూడో అత్యల్ప స్కోరు. 1986లో శ్రీలంకపై కాన్పూర్‌లో 78 పరుగులకు, 1993లో వెస్టిండీస్‌పై అహ్మదాబాద్‌లో 100 పరుగులకు భారత్ ఆలౌటైంది. కాగా, బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్ ఫైవ్ కలిసి చేసిన పరుగులు కేవలం 13 మాత్రమే. వనే్డల్లో భారత్‌కు ఐదుగురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అందించిన అత్యల్ప స్కోరు ఇదే. 1983లో జింబాబ్వేతో జరిగిన వనే్డలో మొదటి ఐదుగురు చేసిన 15 పరుగుల అత్యల్ప రికార్డు ఇప్పుడు బద్దలైంది.
ఈ మ్యాచ్‌లో మొత్తం 13 మెయిడిన్ ఓవర్లు బౌల్ అయ్యాయి. భారత్‌పై ఒక జట్టు ఇన్ని మెయిడిన్లు బౌల్ చేయడం ఇదే మొదటిసారి. వనే్డ చరిత్రలో ఇది మూడోది. 1975 లార్డ్స్ వనే్డలో ఇంగ్లాండ్, 1981 అక్లాండ్ వనే్డలో న్యూజిలాండ్ జట్లు భారత్‌పై 12 చొప్పున మెయిడిన్ ఓవర్లు వేశాయి.