క్రీడాభూమి

హర్మన్‌ప్రీత్ కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 10: హర్మన్‌ప్రీత్ సింగ్ కీలక గోల్ చేయడంతో, హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. సెమీ ఫైనల్స్‌లో పరాజయాలను చవిచూసిన భారత్, జర్మనీ జట్ల మధ్య ఆదివారం మూడు, నాలుగు స్థానాలకు జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠ రేపింది. 2-1 తేడాతో జర్మనీని ఓడించిన భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించి, కాంస్య పతకాన్ని అందుకుంది. ఇరు జట్లు జాగ్రత్తగా ఆడుతూ, అవకాశం దొరికినప్పుడు దాడులకు ఉపక్రమిస్తూ, వ్యూహాత్మక ఆటను కొనసాగించాయి. 21వ నిమిషంలో సునీల్ సోమ్‌వార్‌పేట్ గోల్ చేసి, భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీనితో జర్మనీ ఎదురుదాడికి ఉపక్రమించింది. భారత్ కూడా దీటైన డిఫెన్స్‌తో సమాధానం ఇవ్వడంతో, పోరు తీవ్రమైంది. 36వ నిమిషంలో జర్మనీకి మార్క్ అప్పెల్ ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత రెండు జట్లు పోరాటాన్ని ముమ్మరం చేశాయి. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఫలితం వెల్లడయ్యే అవకాశం లేదని, పెనాల్టీ షూటౌట్ అనివార్యమవుతుందని అంతా భావింరు. కానీ, స్టార్ ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్ 54వ నిమిషంలో సస్పెన్స్‌కు తెరదించాడు. అతను చేసిన కీలక గోల్ భారత్‌కు కాంస్య పతకాన్ని సంపాదించిపెట్టింది.

చిత్రం..హర్మన్‌ప్రీత్ సింగ్