క్రీడాభూమి

విజయంతో సీజన్‌ను ముగిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్‌లో విజయం సాధించి, ఈ సీజన్‌ను పూర్తి చేస్తానని భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌కు అన్ని విధాలా సిద్ధమయ్యానని సోమవారం పీటీఐతో మాట్లాడుతూ సింధు తెలిపింది. గత ఏడాది, రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సింధు ఈ ఏడాది అదే ఒరవడిని కొనసాగించింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిళ్లను గెల్చుకుంది. గ్లాస్గోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని అందుకుంది. అదే విధంగా గత నెల జరిగిన హాంకాంగ్ ఓపెన్‌లోనూ రన్నరప్‌గా నిలిచింది. మొత్తం మీద ఈ ఏడాది సంతృప్తికరంగానే సాగిందని నిరుడు ఇదే టోర్నీలో సెమీస్ వరకూ చేరిన సింధు స్పష్టం చేసింది. దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్‌లో పేరొందిన క్రీడాకారిణులంతా బరిలోకి దిగుతున్నారని, కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకమవుతుందని ఆమె వ్యాఖ్యానించింది. ఒక రకంగా చెప్పాలంటే, మొదటి రౌండ్ నుంచే టోర్నీ ఎంతో సంక్లిష్టంగా ఉంటుందని, ఏ మ్యాచ్‌కి అదే కీలకమవుతుందని పేర్కొంది. ఎవరితో జరిగే మ్యాచ్‌ని కీలకమని అనుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ, ప్రత్యేకంగా ఫలానా అని చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే, కరోలినా మారిన్, నొజోమీ ఒకుహరా వంటి క్రీడాకారిణులతో పోరు ఉత్కంఠ భరితంగానూ, సవాళ్లను విసిరేదిగానూ ఉంటుందని సింధు తెలిపింది. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, ఒక్కో ప్లేయర్ ఒక్కో విధానాన్ని అనుసరిస్తుందని, అందుకే, ఒక మ్యాచ్‌తో మరో మ్యాచ్‌ని పోల్చి చూడడానికి వీల్లేదని 22 ఏళ్ల హైదరాబాదీ సింధు తెలిపింది. విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడాల్సి వస్తున్నప్పటికీ, ఫిట్నెస్ ట్రైనింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సాగడంతో ఇబ్బందులు తలెత్తడం లేదని అక్టోబర్, నవంబర్ మాసాల్లో వరుసగా ఐదు టోర్నీల్లో ఆడిన సింధు చెప్పింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-15’ జాబితాలో ఉన్న వారంతా వచ్చే ఏడాది జరిగే టోర్నీల్లో కనీసం 12 టోర్నీలను తప్పక ఆడి తీరాలని ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించగా, ఈ విషయాన్ని కోచ్ పుల్లెల గోపీచంద్‌తో చర్చించాల్సి ఉందని చెప్పింది. వచ్చే ఏడాది బిజీ షెడ్యూల్ ఉందని, అందుకే ఏఏ టోర్నీలు ఆడాలి? వేటిని వదులుకోవాలి? అనే ప్రశ్నలకు కోచ్‌తో కలిసి ఆలోచించిన తర్వాతే స్పష్టత వస్తుందని సింధు తెలిపింది. వచ్చే ఏడాది వివిధ టోర్నీలతోపాటు కామనె్వల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు కూడా జరగనున్న విషయాన్ని ఆ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ట్రైనింగ్ సెషన్స్‌పైనా స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని తెలిపింది. వచ్చే ఏడాది ఏఏ సమయాల్లో షెడ్యూల్ కష్టతరంగా ఉంటుందో చెప్పలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా సింధు స్పష్టం చేసింది. ఏడాది మొత్తం కీలకంగానే సాగుతుందని తెలిపింది. వచ్చే ఏడాది ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో సర్వీసులకు సంబంధించి కొత్త నిబంధనలను నిర్వాహకులు ప్రవేశపెట్టడాన్ని పీటీఐ ప్రస్తావించగా, ప్రతి టోర్నీకి ముందు ముమ్మరంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అదే విధంగా ఆల్ ఇంగ్లాండ్ టోర్నీకి ముందు కొత్త నిబంధలను దృష్టిలో ఉంచుకొని, ప్రాక్టీస్ చేస్తామని పేర్కొంది. ఈ విషయంలో తమకు పూర్తి స్పష్టత లేదని తెలిపింది. ఈ మార్పు పోటీదారులందరికీ ఉపయోగపడుతుందని చెప్పింది.
తొలి ప్రత్యర్థి బింగ్‌జియావో
దుబాయ్: చైనాకు చెందిన హి బింగ్‌జియావోతో సింధు దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ తొలి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న సింధు బింగ్‌జియావోతోపాటు అకానే యమాగూచి, సయాకో సాటో వంటి మేటి క్రీడాకారిణులతో కలిసి గ్రూప్ ‘ఏ’ నుంచి పోటీపడుతుంది. మరో గ్రూప్‌లో ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్, సంగ్ జీ హ్యున్, రచానొక్ ఇంతనాన్ తదితరులు ఢీ కొంటారు.

చిత్రం..పీవీ సింధు